స్టార్ హీరో భార్య ప్రైవేట్ పార్ట్‌పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్.. ఎవరికి దక్కుతుందో అంటూ
రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పగానే ఒకప్పుడు ఆయన తీసిన శివ, అంతం, క్షణం క్షణం, సర్కార్, వంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమాలు గుర్తుకు వచ్చేవి. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చెప్పగానే పిచ్చి పిచ్చి సినిమాలు , అమ్మాయిలతో రొమాన్స్ మాత్రమే గుర్తుకు వస్తున్నాయి. అయితే రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగతంగా ఎలా ఉన్నప్పటికీ ఆయనలో గొప్ప టెక్నీషియన్ ఉన్నారనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ చాలా అమ్మాయిలతో ఫొటోలు దిగుతుంటారు.
వర్మతో ఫొటోలు దిగడం వల్ల సెలబ్రిటీలుగా మారిన లిస్ట్ కూడా పెద్దదే. అరియానా, అషు రెడ్డి, ఇనయా సుల్తానా వంటి వారు రామ్ గోపాల్ వర్మతో ఫొటోలు దిగిన తరువాతే పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఇటీవల రామ్ గోపాల్ వర్మ తన స్థాయిని ఆయన దిగజార్చుకుంటున్నారు. బహిరంగంగా శృంగారం గురించి మాట్లాడటం తన జీవితంలో పరిపాటిగా మారింది. తాజాగా ఆయన మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈసారి ఏకంగా స్టార్ హీరో భార్య ప్రైవేట్ పార్ట్‌పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రైవేట్ పార్ట్‌పై ఆయన సంచలన కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన వార్-2 సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా, ఎన్టీఆర నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతుంది.ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. తాజాగా విడుదల చేసిన టీజర్‌లో కియారా అద్వానీ హైలెట్‌గా నిలిచింది.
ముఖ్యంగా బికినీతో కనిపించి కుర్రకారుగా నిద్రలేకుండా చేసింది ఈ బ్యూటీ. టీజర్ మొత్తంలో కియారీ అద్వానీ ఒక్కసారే కనిపించినప్పటికీ, ఆమె బికినీ షోతో ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లను సైతం వెనక్కి నెట్టింది. కియారా బికినీ గురించే రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశారు.

కియారా బికినీ ధరించిన ఫొటోలను షేర్ చేస్తూ ''ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరిలో కియారా బ్యాక్ ఎవరికి దక్కుతుందో. అప్పుడే ఇద్దరు బ్యాక్‌బస్టర్ అవుతారు'' అంటూ తన పోస్ట్‌లో రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చారు. కియారా అద్వానీపై రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక హీరోయిన్ ప్రైవేట్ పార్ట్ గురించి ఇంత చండాలంగా మాట్లాడటం ఏంటని ట్రోల్ చేస్తున్నారు. మరి తనపై వస్తోన్న విమర్శలకు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి కౌంటరిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications