అల్లు అర్జున్ కన్నా రామ్‌కే అక్కడ క్రేజ్ ఎక్కువ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులోకన్నా హిందీలోనే భారీ విజయాన్ని సాధించింది. పాన్ ఇండియా సినిమాగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ రూ.400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టు 15నే సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ అభిమానులతో జరిగిన వివాదం.. అనంతర పరిణామాల నేపథ్యంలో నిర్మాతలు డిసెంబరు ఆరుకు వాయిదా వేశారు. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోగా కొనసాగుతోన్న అల్లు అర్జున్ కు హిందీలో కూడా అభిమానులు ఏర్పడ్డారు.
రామ్ అంటే తెలియనివారెవరూ లేరు
అయితే హిందీ బెల్టు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అంటే కొంతమందికైనా తెలియదేమోకానీ రామ్ పోతినేని అంటే మాత్రం తెలియనివారెవరంటూ లేరు. అల్లు అర్జున్ జాతీయ అవార్డు సాధించి జాతీయస్థాయిలో పేరు సంపాదించుకున్నప్పటికీ హిందీ బెల్టులో మాత్రం రామ్ పోతినేనికి విపరీతమైన క్రేజ్ ఉంది. గూగుల్ లో ఎక్కువగా రామ్ గురించే సెర్చ్ చేస్తున్నారు. అతని సినిమాలను చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా ఉత్తరాది సినీ ప్రియులే స్వయంగా చెబుతున్నారు. రామ్ సినిమాలు హిందీలోకి డబ్బింగ్ అయితే అవి కోట్ల సంఖ్యలో వ్యూస్ దక్కించుకుంటున్నాయి. ఇటీవలే ఓ సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్ లోని ఓ చిన్న పట్టణానికి వెళ్లగా రామ్ భయ్యా అంటూ అభిమానులు చుట్టుముట్టడంతో రామ్ కూడా ఆశ్చర్యపోయాడు.

యూట్యూబ్ లో బ్లాక్ బస్టర్లు
వెండితెరపై ఫ్లాప్ అయిన సినిమాలు కూడా యూట్యూబ్ లో సూపర్ హిట్ అవుతున్నాయి. ఇటీవలే డబుల్ ఇస్మార్ట్ చిత్రంతో హిందీ ప్రేక్షకులను రామ్ పలకరించారు. అతను తెలుగులో నటించిన సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి యూట్యూబ్ లో వీక్షణలు కోట్ల సంఖ్యలో దక్కించుకుంటున్నాయి. అల్లు అర్జున్ సినిమాలకు అంత వీక్షణలు లేవు. కేవలం ఇప్పుడు పుష్ప2 సినిమా మీదే క్రేజ్ ఉంది. ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియ హీరోగా స్థిరపడాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ ఉన్నారు. ఆయన ఎంతవరకు ఈ విషయంలో విజయం సాధిస్తారనేది ఆ సినిమా విజయంపై ఆధారపడివుంటుంది.












Click it and Unblock the Notifications