ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో రామ్?
తెలుగు సినీ పరిశ్రమలో ఎనర్జిటిక్ స్టార్ ఎవరంటే అందరూ ముందుగా చెప్పే పేరు రామ్ పోతినేని. తన సినిమాలతో అందరి హీరోల అభిమానులను తన అభిమానులుగా చేసుకున్నాడు. రామ్ సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటుందనే భరోసా నిర్మాతలకే కాకుండా డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఉంటుంది. అందుకే తన సినిమా విడుదలవుతుందంటే నిర్మాత చెప్పిన రేటుకు సినిమాను కొనేస్తారు.
తెలుగు పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరంటే ప్రభాస్ పేరు ఠక్కున చెబుతారు. ఆ తర్వాత బ్యాచిలర్ ఎవరయ్యా అంటే రామ్ పేరు చెబుతారు. రామ్ కు వివాహం చేయడానికి ఇంట్లో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సినిమా రంగానికే చెందిన ఒక హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడనే వార్త వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ వార్తే ట్రెండ్ అవుతోంది.

అనుపమ పరమేశ్వరన్ ను ప్రేమిస్తున్నాడని, అందుకే పెళ్లి చేసుకోవడంలేదని, ఆమెతో అన్నీ సెట్ అయి, ఇంట్లో పెద్దలకు చెప్పి వారు ఒప్పుకున్న తర్వాతే బయట ప్రపంచానికి చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. తనకంటూ ఒక హీరోయిజాన్ని, క్రేజ్ ను సొంతం చేసుకున్న రామ్ తన ప్రేమకు కూడా క్రేజీ హీరోయిన్నే ఎంపిక చేసుకున్నాడంటున్నారు.
వీళ్లిద్దరూ కలిసి హలో గురూ ప్రేమకోసమే సినిమా చేశారు. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. బయట కూడా వీళ్లిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కూడా ప్రేమించుకొని ఇంట్లో అందరూ పెద్దవారు ఒప్పుకున్న తర్వాతే బయట ప్రపంచానికి చెప్పారని, అలాగే వీరిద్దరు కూడా చేస్తున్నారంటున్నారు. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో అనేది వీరిద్దరూ అధికారికంగా ధ్రువీకరిస్తేనే స్పష్టత వస్తుంది. అప్పటివరకు ఎవరికి తోచినది వారు రాసుకోవడమే.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications