క్రేజీ టైటిల్‌తో రామ్ పోతినేని మూవీ.. ఎవరి "తాలూకా" అంటే ?

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని మహేష్ బాబు పి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. #RAPO 22 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీస్థాయిలో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో రామ్ 'సాగర్' అనే కాలేజ్ కుర్రాడి పాత్రలో నటిస్తున్నారు. అలానే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

ఈరోజు ( మే 15, 2025 ) రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. అంతే కాకుండా గ్లింప్స్ కూడా విడుదల చేసి రామ్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమాకి 'ఆంధ్ర కింగ్ తాలూకా' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ram-pothineni-news-movie-title-fixe-as-andhra-king-taluka

ఈ మేరకు రిలీజ్ అయిన గ్లింప్స్ లో సైతం రామ్ లుక్స్ అదిరిపోయాయి అని చెప్పాలి. ముఖ్యంగా రామ్ ఎంట్రీ ఫ్యాన్స్ కి భలే నచ్చేసింది. ఆంధ్ర కింగ్స్ అనే ఒక బ్యానర్ తలకు చుట్టుకొని.. ఎవరి తాలూకా అంటే ఫ్యాన్ తాలూకా.. అని చెప్పడం బాగా కనెక్ట్ అవుతుంది. చివర్లో ఉపేంద్ర భారీ కటౌట్ వద్ద 'ఆంధ్ర కింగ్ తాలూకా' అంటూ టైటిల్ రివీల్ చేశారు.

బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఓ వైపు క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూనే.. మరోవైపు మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఈ యంగ్ హీరో. అయితే గత కొంతకాలంగా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోతున్నాడు. ఇటీవల వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో వరుస పరాజయాలు అందుకున్నాడు. దీంతో కొంచెం గ్యాప్ తీసుకొని మళ్లీ తనకు బాగా కలిసొచ్చిన లవ్ జోనర్ లోకి వచ్చేశారు.

మరోవైపు రామ్, ఈ మూవీలో నటిస్తున్న భాగ్యశ్రీతో రిలేషన్ లో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. రీసెంట్ గానే ఇన్ స్టాలో వీరిద్దరూ పోస్ట్ చేసిన ఫోటోలలో.. ఒకే బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో వీరిద్దరూ కలిసి ఉన్నారని.. డేటింగ్ చేస్తున్నారని అనుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+