మహేష్‌బాబు సినిమా కోసం రంగంలోకి దిగుతున్న రామ్ పోతినేని

మనకున్న యంగ్, ఎనర్జిటిక్ హీరోల్లో రామ్ పోతినేని ఒకరు. దేవదాస్ సినిమాతో పరిచయమై ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నారు. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా చేసిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే నెల 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవలి కాలంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన స్కంద సినిమాతోపాటు మరో మూడు సినిమాలు పరాజయం పాలవడంతో ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు. స్కంద పరాజయం పాలవడం మాత్రం రామ్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది.

డబుల్ ఇస్మార్ట్ పై భారీగా అంచనాలు
డబుల్ ఇస్మార్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్, ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. కావ్యథాపర్ కథానాయికగా నటిస్తోంది. ఇటీవలి కాలంలో విడుదలైన సీక్వెల్ చిత్రాలు ఘోరంగా దెబ్బతింటున్నాయి. భారతీయుడు2, మన్మథుడు2 లాంటివన్నీ అట్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. ఈ సినిమా రామ్ కు ఎటువంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. సినిమా విడుదలైన వెంటనే ఆలస్యం చేయకుండా రామ్ తన తర్వాత సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు.

ram pothineni next movie director p maheshbabu details here

విభిన్నమైన కథతో మరోసారి
అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు దర్శకుడు మహేష్‌బాబు పి. ఈ డైరెక్టర్ తోనే రామ్ తన తర్వాత సినిమా చేస్తున్నాడు. మరో మంచి ప్రేమకథను మహేష్‌బాబు రామ్ కోసం సిద్ధం చేశాడు. కథ విభిన్నంగా ఉండటంతో రామ్ కు బాగా నచ్చింది. ఈసినిమాను మైత్రీ మూవీస్ పతాకంపై యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన భారీ సెట్ ను ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబరు నుంచి రెగ్యులర్ గా షూటింగ్ ను ప్రారంభించి తొందరలోనే విడుదల చేయబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+