రైటర్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని..!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ భారీస్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తుంది.
ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. రామ్ ఉపేంద్రకు వీరాభిమానిగా కనిపించనుండడం ఇప్పటికే మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. కాగా ఈ సినిమాతో రామ్ నటుడిగా మాత్రమే కాకుండా.. తనలోని మరో టాలెంట్ బయట పెట్టినట్టు తెలుస్తోంది.

రైటర్‌గా మారిన రామ్..
నటుడిగానే కాకుండా రైటర్‌గా కూడా తన ప్రతిభను పరిచయం చేశారు రామ్. ఆయన రాసిన 'నువ్వుంటే చాలే' అనే ఫస్ట్ సింగిల్‌ను చిత్ర బృందం లేటెస్ట్ గా విడుదల చేసింది. ఈ పాటను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ పాడగా.. వివేక్-మెర్విన్ సంగీతాన్ని అందించారు. రామ్ రాసిన సాహిత్యం సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.
ఒక చూపుతో నాలోన పుట్టిందే... ఏదో వింతగా గుండెల్లో చేరిందే... నువ్వెవ్వరో నాలో అని అడిగానే... తానేగా ప్రేమనే తెలిపిందే...'' వంటి వాక్యాలతో మొదలయ్యే ఈ పాటకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అలానే 'దారిలేని ఊరినే అడిగానుగా, నువ్వేగా దారని నాకు చూపుతుంది... కమ్ముకున్న మబ్బులో వెతికానుగా, అరే గాలివానై నన్ను తాకుతుంది...'' లాంటి లిరిక్స్ సాహిత్యంపై ఆయన ఉన్న మక్కువను చూపిస్తున్నాయి.
అంతకు ముందు మహేష్ దర్శకత్వంలో వచ్చిన 'రా రా కృష్ణయ్య' సినిమాతో డీసెంట్ హిట్ సాధించగా.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆయన చేస్తోన్న మూడో సినిమా కావడంతో ఈ చిత్రంపై పై భారీ అంచనాలున్నాయి. ఇక అయితే గత కొంతకాలంగా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోతున్నాడు. గతేడాది "డబుల్ ఇస్మార్ట్" తో ప్రేక్షకులను పలకరించిన ఈ హీరో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. దీంతో ఈసారి తనకు బాగా కలిసొచ్చిన లవ్ జోనర్ లోకి వచ్చేశారు. చూడాలి మరి వీరి కాంబో ఏం మ్యాజిక్ చేస్తుంది అని.
మరోవైపు రామ్, ఈ మూవీలో నటిస్తున్న భాగ్యశ్రీతో రిలేషన్ లో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. రీసెంట్ గానే ఆమె ఇన్ స్టాలో ఒక ఫోటో షేర్ చేసింది. అందులో ఒక గదిలో సన్ కిస్ పోజులో పోస్ట్ చేసింది. అయితే అదే బ్యాక్ గ్రౌండ్ లో రామ్ ఫోటో కూడా ఒక ఫోటో పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరూ కలిసి ఉన్నారని.. డేటింగ్ చేస్తున్నారని అనుకుంటున్నారు.
-
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
పెళ్లి కంటే సహజీవనం బెస్ట్: మెగా హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
కొత్త బిజినెస్ షురూ చేసిన తెలుగు యాంకర్..! -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !!












Click it and Unblock the Notifications