తెలుగులో అట్టర్ ఫ్లాప్... హిందీలో దుమ్మురేపుతోంది

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని కథానాయకుడిగా తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ సినిమా తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. రూ.49కోట్ల థియేట్రికల్ వ్యాపారం జరగ్గా బ్రేక్ ఈవెన్ అవడానికి రూ.50 కోట్లు రాబట్టాలి. అయితే ఈ సినిమాలో పూరీ మార్క్ లేకపోవడం, స్క్రీన్ ప్లే పేలవంగా ఉండటం, అలీ కామెడీ దరిద్రంగా ఉండటంతో కేవలం మొత్తం మీద రూ.11.42 కోట్లు మాత్రమే రాబట్టి భారీ డిజాస్టర్ గా నిలిచింది. గతేడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య థాపర్, ప్రతినాయకుడిగా సంజయ్ దత్ నటించారు.

100 మిలియన్ల వ్యూస్.. 1 మిలియన్ లైక్స్
రామ్ కెరీర్ లో మాయని మచ్చలా నిలిచిన ఈ సినిమాను తాజాగా ఆర్కేడీ స్టూడియోస్ వారు డబుల్ ఇస్మార్ట్ హిందీ వెర్షన్ ను యూట్యూబ్ లో విడుదల చేయగా 100 మిలియన్ల వ్యూస్ సాధించి దుమ్ము రేపుతోంది. 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. రోజురోజుకు సినిమా వ్యూస్ పెరుగుతున్నాయేకానీ తగ్గడంలేదు. తెలుగులో థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాను నార్త్ ప్రేక్షకులు ఎందుకు అంతగా ఆదరిస్తున్నారనే విషయం సినీ విశ్లేషకులకు కూడా అంతుపట్టడలేదు. అంతటి భారీ విజయాన్ని ఈ సినిమా యూట్యూబ్ లో సాధించింది.

Ram Pothineni s Double iSmart movie Hindi version sets record by achieving 100 million views and one million likes on YouTube

అల్లు అర్జున్ కన్నా రామ్ కే క్రేజ్ ఎక్కువ
గతంలో రామ్ సినిమాలు చాలావరకు వందల సంఖ్యలో మిలియన్ల వ్యూస్ ను సాధించినవే. అంత క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ కన్నా హిందీ ప్రేక్షకుల్లో రామ్ అంటేనే క్రేజ్ ఎక్కువగా ఉందని ఎన్నో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను డబుల్ ఇస్మార్ట్ నిజం చేస్తోంది. పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. లైగర్ పరాజయం పాలైన తర్వాత ఎవరూ పూరీతో సినిమా చేయడానికి ముందుకు రాకపోవడంతో రామ్ ముందుకు వచ్చాడు. అయితే రామ్ నమ్మకాన్ని పూరీ జగన్నాథ్ నిలబెట్టలేకపోయాడు. ఈ సినిమాతో పూరీ, ఛార్మి తలరాత మారిపోతుందని అందరూ భావిస్తే అది వ్యతిరేక దిశలో మారిపోయింది. ప్రస్తుతం మహేష్ దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+