'రామాయణ' సినిమాకు గౌతమ్ ఘట్టమనేని షాకింగ్ రివ్యూ..

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రామాయణ మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ దృశ్య కావ్యాన్ని బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దీపావళి కానుకగా ఈ మూవీ పార్ట్ 1 నవంబర్ 5 న విడుదలైంది. ప్రస్తుతం సంచలన వసూల్లతో దూసుకెళ్తోంది. విడుదలైన కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్ల క్లబ్‌ లోకి అడుగుపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌ బీర్ కపూర్ రాముడిగా నటించారు. అలాగే సాయి పల్లవి సీతాదేవిగా అలరించారు. ఇక రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా నటించారు. వీరితోపాటు లక్ష్మణుడిగా రవి దూబే.. హనుమంతుడిగా సన్నీ డియోల్ నటించారు. ఇక ఫేమస్ మ్యూజిక్ కంపోజర్స్ హన్స్ జిమ్మర్, ఏ ఆర్ రెహమాన్ సంయుక్తంగా స్వరాలను సమకూరుస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని ఫ్రైమ్ స్టూడియోస్, మాన్ స్టర్ మైండ్స్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నమిత్ మల్హోత్రా, యష్ కలిసి సంయుక్తంగా నిర్మించారు.

అయితే ఈ మూవీకి తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని రివ్యూ అండ్ రేటింగ్ ఇచ్చారు. ఈ మేరకు ప్రముఖ మూవీ రేటింగ్ ప్లాట్‌ ఫారమ్ లెటర్‌ బాక్స్డ్ వేదికగా ఆయన స్పందించారు. ఈ దృశ్య కావ్యంపై ఆయన స్పందిస్తూ ఏకంగా 4.5 రేటింగ్ ఇవ్వడం ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీ చూశాక తన మనసు కరిగిపోయిందని.. నిజంగా మాటలు రావడం లేదని పేర్కొన్నారు. ఈ మూవీలోని సీజీఐ, స్క్రిప్ట్, దర్శకత్వ ప్రతిభతోపాటు నటీనటుల యాక్టింగ్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

Ramayana movie Here is the review and rating given by Gautam Ghattamaneni for the movie Ramayana

ఇక రణ్ బీర్ కపూర్ రాముడి పాత్రలో ఎప్పటిలాగే అత్యద్భుతంగా నటించారని పేర్కొన్నారు. అయితే రావణుడిగా యష్ నటన ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. ఈ మూవీలో ఆయన నటన అసాధారణం అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది అని పేర్కొన్నారు. ఇక రామాయణ మూవీపై గౌతమ్ ఘట్టమనేని ఇచ్చిన రివ్యూ అండ్ రేటింగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+