బాక్సాఫీస్ సునామీ.. టికెట్ ముక్క లేదు.. వామ్మో ఇన్ని కోట్లా..!
ప్రస్తుతం ఎక్కడ చూసినా 'రామాయణ' మూవీ మేనియా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి విశేష ఆదరణ లభిస్తోంది. ఇక మనదేశంలో నార్త్ సౌత్ అని తేడా లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 5 న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఏమాత్రం ఆగడం లేదు. రోజురోజుకూ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. రిలీజ్ అయిన 12 రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1,437.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ మేరకు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటివరకూ పాన్ ఇండియా రేంజ్ లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సినిమాలుగా నిలిచిన అన్నింటినీ ఒక్కొక్కటిగా లేపేసింది రామాయణ మూవీ. కేవలం రెండు వారాల్లోనే ఆల్ టైమ్ హయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన టాప్ 5 చిత్రాల్లో చోటు సంపాదించుకుంది.
ఇప్పటివరకూ పాన్ ఇండియా రేంజ్ లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీస్ గా నిలిచిన చిత్రాలను ఒక్కొక్కటిగా దాటేసింది. ధురంధర్ సినిమా లైఫ్ టైమ్ రన్ లో బాక్సాఫీస్ వద్ద రూ. 1,307 కోట్లు రాబట్టింది. ఆ చిత్రాన్ని సులభంగా ఈ మూవీ కేవలం 12 రోజుల్లోనే అధిగమించింది. అలాగే దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కేవలం 10 రోజుల్లోనే లేపేసింది. అలాగే యష్ కేజీఎఫ్ చాప్టర్ 2, ప్రభాస్ కల్కి 2898 AD చిత్రాలను సునాయాసంగా దాటేసింది. ఇప్పుడు ధురంధర్ 2, పుష్ప 2, బాహుబలి 2 రికార్డులపై గురి పెట్టింది. చూస్తుంటే మరో వారం రోజుల్లో ఈ రికార్డులను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే రూ. 2వేల కోట్లతో టాప్ ప్లేస్ లో ఉన్న దంగల్ మూవీ రికార్డులను కూడా రామాయణ మూవీ ఫుల్ రన్ లో క్రాస్ చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. మరి రానున్న రోజుల్లో రామాయణ మూవీ ఇంకెన్ని అద్భుతాలను సృష్టిస్తుందో వేచి చూడాలి.

రామాయణ మూవీలో శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించారు. అలాగే సీతాదేవిగా సాయి పల్లవి నటించింది. ఇక రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా నటించారు. అలాగే లక్ష్మణుడిగా రవి దూబే.. ఇక హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దంగల్ ఫేమ్ నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక ఈ ప్రాజెక్టును ఫ్రైమ్ స్టూడియోస్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నమిత్ మల్హోత్రా, యష్ సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ చిత్రానికి కొనసాగింపుగా రూపొందనున్న రెండో భాగాన్ని మేకర్స్ వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.












Click it and Unblock the Notifications
