గణేష్ చతుర్థి స్పెషల్.. ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్!
Ramayana Movie: దేశమంతటా వినాయక చవితి పండుగ వాతావరణం ఎంతో కోలాహలంగా సాగుతోంది. గణనాథుని రాకతో ఊరూవాడా గణేశుని నామస్మరణతో మారుమోగుతున్న ఈ ప్రత్యేక పర్వదినం రోజున సినీ ప్రేమికుల కోసం 'రామాయణ' చిత్రబృందం ఓ అద్భుతమైన సర్‌ప్రైజ్ అందించింది. సినీ ప్రియులు ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణ:పార్ట్ 1' నుంచి శ్రీరాముడు, సీతాదేవిల దివ్య రూపాలతో కూడిన 'సియా రామ్' పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
సీతారాములుగా మెరిసిన సాయిపల్లవి, రణబీర్ కపూర్
విఘ్నేశ్వరుడి పూజల వేళ విడుదలైన ఈ 'సియా రామ్' పోస్టర్‌లో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, సాయి పల్లవి సీతామాత పాత్రలో కనిపించి అభిమానులను మంత్రముగ్ధులను చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విడుదలైన కొద్దిసేపట్లోనే విపరీతంగా వైరల్ అయింది. పవిత్రమైన గణేష్ చతుర్థి నాడు శ్రీరాముడు, సీతాదేవిల ఆధ్యాత్మిక రూపాన్ని చూడటం అభిమానులకు ఎంతో ప్రత్యేకమైన, సంతోషకరమైన అనుభూతిని అందించింది.

సాయి పల్లవి దైవిక రూపానికి ముగ్దులవుతున్న ఫ్యాన్స్
ప్రారంభంలో సినిమాకు సంబంధించిన ప్రకటనలు లేదా గ్లింప్స్ వచ్చిన సమయంలో సాయిపల్లవి నటన, లుక్స్ పై కొన్ని అనుమానాలు, ప్రశ్నలు తలెత్తాయి. ముఖ్యంగా సీతగా సాయిపల్లవి సరిపోతుందా లేదా అనే చర్చ కూడా జరిగింది. అయితే తాజాగా విడుదలైన ఈ'సియా రామ్' పోస్టర్ చూసిన తర్వాత నెటిజన్లు, అభిమానులు ఆమె లుక్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సీతామాతగా సాయి పల్లవి రూపం ఎంతో దైవికత్వంతో, సహజంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే శ్రీరాముడిగా రణబీర్ కపూర్ లుక్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో ఇది ఒకటిగా నిలవనుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్(శ్రీరాముడు), సాయిపల్లవి(సీతాదేవి)లతో పాటు రాకింగ్ స్టార్ యష్ 'రావణాసురుడి' పాత్రలో నటిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది.
దీపావళి బరిలో 'రామాయణ'
ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న 'రామాయణ' సినిమా రాబోయే దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా అభిమానుల్లో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పౌరాణిక నేపథ్యం, అద్భుతమైన తారాగణం, భారీ మేకింగ్‌తో రూపొందుతున్న ఈ సినిమా వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.
🚨 #RAMAYANA MARKETING CAMPAIGN BEGINS! 🏹🙏
— BollyHUB (@Samirmaske303) September 14, 2026
The first poster is here — Ranbir Kapoor as Lord Ram × Sai Pallavi as Maa Sita. ✨❤️
And now, the much-awaited #JaiJaiRam is next! 🔥
🎙️ Arijit Singh × Shreya Ghoshal
🎼 A.R. Rahman
THE RAMAYANA ERA BEGINS. 🏹🔥#Ramayana… pic.twitter.com/bf4N2Oh0xE














Click it and Unblock the Notifications
