Ramayana First Review: 'రామాయణ' ఫస్ట్ రివ్యూ ఇదే..

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'రామాయణ' ఒకటి. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా.. సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. అలాగే రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ చిత్రానికి దంగల్ మూవీ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నుంచి పార్ట్ 1 దీపావళి సందర్భంగా నవంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. దాంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూస్తామా..? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు రామాయణ సినిమాపై ఉన్న బజ్ కారణంగా రిలీజ్ ​కు దాదాపు 15 రోజుల ముందుగానే ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి.

ఇక రామాయణ మూవీలో హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ ఎక్స్ ను వాడారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మ్యూజిక్ కంపోజర్స్ హన్స్ జిమ్మర్, ఏ ఆర్ రహమాన్ సంయుక్తంగా స్వరాలను సమకూర్చారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ఫ్రైమ్ స్టూడియోస్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నమిత్ మల్హోత్రా, యష్ కలిసి నిర్మించారు. ఈ మూవీ సెన్సార్ ఇటీవల పూర్తయింది. పార్ట్ 1 మూవీ రన్ టైమ్ ఏకంగా 3 గంటల 15 నిమిషాలుగా ఉన్నట్లు తేలింది. ఇక రామాయణ రెండు పార్ట్స్ కు కలిపి రూ. 4000 వేల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కింది.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ను ముంబై లోని ఒక థియేటర్ లో ప్రత్యేకంగా కొంతమంది బయర్స్ కు వేసి చూపించారట. అందుకు సంబంధించిన టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రామాయణ మూవీలో అందరికన్నా రాకింగ్ స్టార్ యష్ రావణుడి పాత్రలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించినట్లు స్పష్టం అవుతోంది. కేజీఎఫ్ సిరీస్, టాక్సిక్ చిత్రాలతో నెగటివ్ క్యారెక్టర్స్ లో పండిపోయిన యష్.. ఈ మూవీలో రావణాసురుడి పాత్రకు ప్రాణం పోసినట్లు తెలుస్తోంది.

Ramayana the very first review of the movie featuring the pairing of Ranbir Kapoor and Sai Pallavi

ప్రీ క్లైమాక్స్ వరకూ యష్ దే పైచేయిగా ఉంటుందని క్లైమాక్స్ లోనే రాముడిగా రణ్ బీర్ కపూర్ డామినేషన్ ఉంటుందని సమాచారం అందుతోంది. ఇక ఈ మూవీలో ఎమోషన్స్ ను పండించడంలో దర్శకుడు నితీష్ తివారీ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఇక సీత పాత్రలో సాయి పల్లవి తనదైన శైలిలో సహజమైన నటనతో కట్టిపడేస్తుందని సమాచారం. ఇక హాలీవుడ్ స్థాయిలో వీఎఫ్ ఎక్స్ థియేటర్లలో ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తాయని తెలుస్తోంది. ఇక ఫుల్ రివ్యూ కోసం నవంబర్ 5 వరకూ వేచి చూడాల్సిందే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+