శ్రీరాముడిగా సల్మాన్ ఖాన్.. "రామాయణం" షూటింగ్ సగం పూర్తి !

పురాణాల ఆధారంగా భారీ సినిమాలు రూపొందించడం సినీ పరిశ్రమలో తాజా ట్రెండ్‌గా మారిపోయింది. ఇప్పటికే పలు చిత్రాలు రిలీజ్ అవ్వగా.. ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో 'రామాయణ' మూవీ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించి మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది.

అయితే ఈ తరహా రామాయణ ప్రాజెక్టు బాలీవుడ్‌లో 1990ల కాలంలోనే ప్రారంభించి.. 40 శాతం షూటింగ్ కూడా ఫినిష్ చేశారు. కానీ పలు కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి రాగా సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ramayanam-movie-details-that-salman-khan-as-lord-sriram

రాముడిగా సల్మాన్ ఖాన్..

బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ రాముడిగా ఈ రామాయణం తెరకెక్కే ప్రయత్నం జరిగింది. సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. సొనాలి బింద్రే సీతగా.. పూజా భట్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ కోసం సల్మాన్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. విల్లు, బాణంతో ఆయన ఉన్న ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.

ఆగిపోవడానికి కారణం అదే..!

అయితే ఆ సమయంలో సొహైల్ ఖాన్-పూజా భట్ మధ్య ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ జోక్యం చేసుకుని.. పూజాకు గట్టి వార్నింగ్ ఇచ్చారట. దాంతో అలిగిన పూజా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. సగం షూటింగ్ పూర్తయిన తరువాత ఆమె స్థానంలో మరో నటి తీసుకునే పరిస్థితి లేకపోవడంతో సినిమాను అర్ధాంతరంగా నిలిపేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్టును మళ్లీ పునఃప్రారంభించేందుకు ఎంతో ప్రయత్నించారు. అయితే అనుకోని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. ఒకవేళ ఆ చిత్రం పూర్తి అయితే, బాలీవుడ్ పౌరాణిక చిత్రాలకు సల్మాన్ ఒక మైలురాయిగా నిలిచేవారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ramayanam-movie-details-that-salman-khan-as-lord-sriram

మరోవైపు సల్మాన్‌ హిట్స్-ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా తనదైన స్టైల్‌లో కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉన్నాడు. రీసెంట్ గానే మురుగదాస్ దర్శకత్వంలో "సికిందర్" అనే భారీ యాక్షన్ సినిమా చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, సల్మాన్‌కు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అలానే బిగ్‌బాస్ హోస్ట్‌గా కూడా విజయవంతంగా కొనసాగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+