ముగ్గురు దేవకన్యలు.. ఒక అల్లరి హీరో.. ట్రైలర్ చూస్తే నవ్వులే నవ్వులు!

Ramba Oorvasi Menaka Trailer: ప్రముఖ హీరో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమా 'రంభ ఊర్వశి మేనక'. తాజాగా స్టార్ హీరో అక్కినేని నాగార్జున చేతుల మీదుగా రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణ సినిమా స్టోరీలకు భిన్నంగా ఓ విచిత్రమైన ఫాంటసీ కథాంశానికి కామెడీని జోడించి ఈ సినిమాను తీసుకొస్తున్నట్లు ట్రైర్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది.

Toxic First Review: టాక్సిక్ మూవీ ఫస్ట్ రివ్యూ.. హిట్టా..? ఫట్టా..?
Toxic First Review: టాక్సిక్ మూవీ ఫస్ట్ రివ్యూ.. హిట్టా..? ఫట్టా..?

దేవకన్యల రాక.. సూరి కష్టాలు
ఇక స్టోరీ విషయానికి వస్తే.. ప్రధాన పాత్రధారి అయిన సూరి(అల్లరి నరేష్) పట్టుదలగా చేసే ప్రార్థనల ఫలంగా స్వర్గం నుంచి రంభ, ఊర్వశి, మేనక వంటి దేవకన్యలు మానవ లోకంలోకి అడుగుపెడతారు. అయితే భూమిపై అడుగుపెట్టిన మరుక్షణమే వారు తమ దైవిక శక్తులను కోల్పోతారు. దాంతో వారి వల్ల తలెత్తే ఊహించని సమస్యలు, విచిత్ర పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత సూరి భుజాన పడుతుంది. ఈ క్రమంలో జరిగే పరిణామాలు థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది.

Ramba Ooorvasi Menaka Trailer Out Allari Naresh Hilarious Fantasy Ride Read the Full Review Here

నటీనటుల పనితీరు, కామెడీ టైమింగ్
అల్లరి నరేష్ తనదైన మార్కు వినోదంతో మరోసారి పూర్తిస్థాయి కామెడీ పాత్రలో మెప్పించారు. నరేష్-వీకే నరేష్‌ల మధ్య కెమిస్ట్రీ, పంచ్ సంభాషణలు నవ్వులు పూయిస్తాయి. ఇంద్రుడి పాత్రలో వెన్నెల కిషోర్ తన శైలికి తగిన హాస్యాన్ని అందించగా.. సురభి నరేష్ ప్రేయసిగా కనిపించింది. రాశి సింగ్, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్ అప్సరసలుగా గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు.

అల్లు అర్జున్ 'రాకా’పై మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్!
అల్లు అర్జున్ 'రాకా’పై మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్!

సాంకేతిక బలం, నిర్మాణ విలువలు
రాంరెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ దృశ్యాలను కలర్‌ఫుల్‌గా చూపించగా.. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ సినిమా ఉత్సాహభరిత మూడ్ ను మరింత పెంచింది. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ విలువలు ఈ జానర్‌కు చాలా బాగున్నాయి.ట్రైలర్‌ను బట్టి చూస్తే, 'రంభ ఊర్వశి మేనక' ఫాంటసీ, వినోదాల అద్భుతమైన కలయికగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 4న విడుదల కానున్న ఈ సినిమాకు ట్రైలర్ నాంది పలికింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+