జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌కు ఊహించని షాక్ ఇచ్చిన రామ్‌చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పెద్ది. ఈ సినిమకు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా పెద్దికి సంబంధించిన గ్లింప్స్ విడుదలై విపరీతమైన ఆదరణ దక్కించుకుంటోంది. గతంలో విడుదలైన స్టార్ హీరోల సినిమాల రికార్డులను ఈ గ్లింప్స్ బద్దలు కొడుతోంది. పెద్ది గ్లింప్స్ విడుదల కాకముందు ఎన్టీఆర్ దేవర గ్లింప్స్ మొదటి స్థానంలో, అల్లు అర్జున్ పుష్ప2 గ్లింప్స్ రెండో స్థానంలో నిలిచేవి. పెద్ది గ్లింప్స్ ఈ రెండింటి రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను నమోదు చేస్తోంది.

టాప్ 1లో నిలిచిన పెద్ది
సీతారాముల కల్యాణం జరిగే శ్రీరామనవమిని పురస్కరించుకొని పెద్ది గ్లింప్స్ ఆదివారం విడుదల చేశారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మళయాళంలో కూడా విడుదల కాగ గడిచిన 24 గంటల వ్యవధిలో 36.5 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. తెలుగులో ఇతర హీరోల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడం విశేషం. దేవరకు 28.7 మిలియన్ల వ్యూస్ రాగా, పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీకి 27.12 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అలాగే పుష్ప2కు 27.11 మిలియన్ల వ్యూస్ రాగా, ప్రభాస్ నటించిన కల్కి సినిమాకు 23.1, మహేష్ బాబు గుంటూరు కారంకు 21.1 మిలియన్ల వ్యూస్ వచ్చి టాప్5లో నిలిచాయి.

ramcharan shock to junior ntr and allu arjun

సినిమా హిట్ అవడం చాలా ముఖ్యం
ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ చెప్పిన డైలాగులను అందరినీ ఆకట్టుకున్నాయి. మనిషి బతికున్నప్పుడే ఏదో ఒకటి చేయాలంటూ ఆయన క్రికెట్ మైదానంలోకి దిగిన తీరు కూడా అద్భుతంగా ఉంది. రామ్ చరణ్ గత సినిమా గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కావడంతోపాటు దానికి ముందు సినిమా ఆచార్య కూడా ఫ్లాప్ కావడంతో ఈ సినిమా కచ్చితంగా ఆడి తీరాలి.

అభిమానులు కూడా దీనికోసం ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ కు వరుసగా రెండు సినిమాలు ప్లాప్స్ కావడం నిరాశ కలిగించింది. అయితే పెద్ది సినిమా కచ్చితంగా ఆడుతుందంటూ అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెద్ది గ్లింప్స్ కొత్త రికార్డులు నమోదు చేస్తుండటంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+