మెగా ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. రామ్ చరణ్ కు అత్యవసర సర్జరీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. పెద్ది ట్రైలర్ మే 18న ముంబైలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ ను వేగవంతం చేసింది. అయితే రామ్ చరణ్ అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. పెద్ది సినిమా కోసం చరణ్ ప్రాణం పెట్టి కష్టపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజైన పెద్ది సినిమా కంటెంట్ చూస్తేనే అర్థం అవుతోంది.
అయితే పెద్ది షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కు అనేక గాయాలు అయ్యాయి. ఇదే విషయంపై తాజాగా పెద్ది చిత్ర నిర్మాత కీలక వ్యాఖ్యలు చేశారు. ' పెద్ది సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కు మూడు గాయాలు అయ్యాయి. కంటికి అయిన గాయం అందరికీ తెలిసిందే. కానీ ఆయన మణికట్టుకు కూడా గాయం అయింది. మణికట్టు లోపల చాలా ఎఫెక్ట్ అయింది. అయినా కష్టపడి షూటింగ్ పూర్తి చేశారు చరణ్.
ఆయనకు మే 18న ముంబైలో మణికట్టుకు ఆపరేషన్ ఉంది. షూట్ లో ఉన్నప్పుడు పక్కనే ఫిజియో థెరపిస్ట్ ను కూడా పెట్టుకున్నారు. చరణ్ షూట్ గ్యాప్ లో అక్కడే జిమ్ చేసేవారు. కుస్తీ పోటీల్లో చాలా సార్లు చరణ్ కు కండరాలు పట్టేశాయి. అప్పుడు ఫిజియో థెరపీ చేయించుకొని మళ్లీ వెంటనే షూటింగ్ కు వచ్చేవారు. చరణ్ కు కాలు కూడా బెనికింది.. అని నిర్మాత సతీష్ కిలారు తెలిపారు. ఈ విషయం తెలియగానే చరణ్ త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా మెగా అభిమానుల ప్రార్థనలు చేస్తున్నారు.

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 2న హైదరాబాద్ లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక తాజాగా పెద్ది సినిమా శాటిలైట్ హక్కులకు సంబంధించిన ఒక సాలిడ్ డీల్ క్లోజ్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం భారీగా పోటీ నెలకొంది. ఫిలింనగర్ ట్రేడ్ వర్గాల ఇన్ సైడ్ టాక్ ప్రకారం.. పెద్ది సినిమా తెలుగు శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ నెట్‌వర్క్ జీ తెలుగు ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications