శివగామిని మించి పోయే రేంజ్ లో కమల రెడ్డి
సెకెండ్ ఇన్నింగ్ లో మంచు మనోజ్ తడాఖా చూపుతున్నాడు. వరుస సినిమాలతో దూసుకెళ్తోన్నాడు. 2017లో విడుదలైన ఒక్కడు మిగిలాడు తర్వాత చాలాకాలం పాటు సినిమాలకు దూరం అయ్యాడు. ఒకట్రెండు సినిమాల్లో క్యామియో అప్పియరెన్స్ ఇచ్చాడంతే. గత ఏడాది మళ్లీ స్క్రీన్ పైకి వచ్చాడు. భైరవం, మిరాయ్ తో అదరగొట్టాడు. ఈ ఏడాది డేవిడ్ రెడ్డి చేస్తోన్నాడు. హనుమ రెడ్డి యక్కంటి ఈ చిత్రంతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమౌతున్నాడు.
డేవిడ్ రెడ్డి.. 1897-1922 మధ్య కాలానికి చెందిన పీరియడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. సుప్రీమ్ సుందర్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తోన్నాడు. ఈ పీరియాడికల్ డ్రామాకు ఆచార్య వేణు సినిమాటోగ్రాఫర్. అప్పట్లో విడుదలైన ఈ గ్లింప్స్ లో వార్ డాగ్ బైక్‌ను నడుపుతూ, డెత్ నోట్ అనే స్టిక్ పట్టుకుని రగ్డ్ లుక్ లో కనిపించాడు మనోజ్.

పాన్ ఇండియా లెవెల్ మూవీ ఇది. బ్రిటిషర్లకు మాత్రమే కాదు, భారతీయులకు కూడా శత్రువు అనే యూనివర్సెల్ కాన్సెప్ట్ తో మంచు మనోజ్ క్యారెక్టర్ ను తీర్చిదిద్దినట్లు ప్రచారం జరుగుతోంది. కథ కల్పితమే అయినా కొన్ని వాస్తవ సంఘటనల నుండి పొందిన ప్రేరణతో ఈ సినిమా కథను అల్లుకున్నారు. భరత్ మోతుకూరి, వెంకటరెడ్డి నల్లగంగుల ఈ సినిమాను నిర్మిస్తోన్నారు.
డేవిడ్ రెడ్డి మూవీ నుండి చిత్ర బృందం ఓ క్యారెక్టర్ ను తాజాగా పరిచయం చేసింది. సీనియర్ నటి రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. నేడు ఆమె బర్త్ డే. దీన్ని పురస్కరించుకుని ఈ లుక్ రిలీజ్ అయింది. దీన్ని మంచు మనోజ్ తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
One look. The entire frame belongs to her. 🔥
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 15, 2026
Happy Birthday, @meramyakrishnan garu! ❤️🙏🏻 An honour to share the screen with you!
Presenting the ferocious #KamalaReddy from #DavidReddy. ⚔️
Just wait till you see her in action. 🔥#HBDRamyaKrishnan garu pic.twitter.com/MDcVqlEsiA
ఈ ఫిల్మ్ లో ఆమె క్యారెక్టర్ పేరు.. కమల రెడ్డి. "ఆమె యుద్ధ రంగానికి భయపడదు.. యుద్ధ రంగమే ఆమెను చూసి భయపడుతుంది.." అనే ఓ పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో ఈ పోస్టర్ అదరగొడుతోంది. చూడ్డానికి ఓ వారియర్ గా కనిపించారామె. పాలెగత్తె తరహాలో రమ్యకృష్ణ క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లనిపిస్తోంది. వెనుక సింహాసనం, చెల్లాచెదురుగా పడ్డ మృతదేహాలపై రక్తమోడుతున్న స్థితిలో ఠీవిగా కూర్చున్న స్థితిలో ఉన్న లుక్ అది. ఈ ఫిల్మ్.. బాహుబలి తర్వాత ఆమెకు ఈ స్థాయిలో మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ పడినట్టయింది.












Click it and Unblock the Notifications
