సమంతపై అదిరిపోయే సెటైర్లు వేసిన స్టార్ హీరోలు
దక్షిణాది బ్యూటీ సమంత ప్రస్తుతం సిటాడెల్ రీమేక్ సిరీస్ హనీబన్నీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంటోంది. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రమోషన్లలో పాల్గొంటోంది. ఈనెల ఏడోతేదీన అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతోంది. సిటాడెల్ లో ప్రియాంక చోప్రా చేసిన యాక్షన్ అడ్వెంచర్స్ సమంత చేయడంపై సినీప్రియులంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం సొంత బ్యానరులో ఓ సినిమా చేస్తోంది. మరో వెబ్ సిరీస్ చేయడానికి అంగీకారం తెలిపింది. అంతకుమించి ఆమెదగ్గర సినిమాలు లేవు. మయోసైటిస్ చేయడానికి ముందు చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు ఏడాదిన్నర గ్యాప్ ఇవ్వడంతో సినిమాలు రావడంలేదు.
ఆటపట్టించిన రానా
అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకల్లో సమంత ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ చేతులమీదుగా ఈ అవార్డును సామ్ స్వీకరించింది. కార్యక్రమానికి యాంకర్లుగా రానా, తేజ సజ్జా వ్యవహరించారు. బాలీవుడ్ సెలబ్రిటీలంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చాలాకాలం తర్వాత తిరిగి ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని, ఈ సమయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, మహిళలు తమకు ఎన్ని ఇక్కట్లు ఎదురైనా జీవితంలో ఎదుగుతూనే ఉండాలని, అందుకు కావల్సిన శక్తిని సముపార్జించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రానా, తేజకు, సమంతకు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. రానా సమంతను ఆట పట్టించే ప్రయత్నం చేశారు.

సిస్టర్ ఇన్ లా నుంచి సిస్టర్ వరకు
''ఒకప్పుడు మా సిస్టర్ ఇన్ లా నుంచి సిస్టర్ వరకు వెళ్లింది.. నువ్వేంటి తెలుగు సినిమాలు చేయట్లేదు?'' అని ప్రశ్నించాడు. ''నువ్వు ఎందుకు చేయట్లేదు''? అని సమంత తిరిగి ప్రశ్నించగా ''తనను ఎవరూ తీసుకోవడంలేదని'' రానా జవాబిచ్చాడు. ''నా పరిస్థితి కూడా అలాగే ఉందని'' సమంత జవాబిచ్చింది. మొత్తానికి రానా, సమంత.. ఇద్దరూ తమకు అవకాశాలు రావడంలేదని ప్రత్యక్షంగా చెప్పారు. తర్వాత సమంత మాట్లాడుతూ మనం సినిమా చేస్తున్నామంటే నరసింహనాయుడిలా ఉండాలికానీ రానానాయుడిలా ఉండకూడదు అని సెటైర్ వేసింది. దీంతో రానా.. రానా నాయుడు సినిమా కదక్కా.. అది వెబ్ సిరీస్.. వెబ్ సిరీస్ అంటే ఏమైనా చేయొచ్చు.. అది కూడా నీ వెబ్ సిరీస్ ఫ్యామిలీమాన్ చూసే నేర్చుకున్నానంటూ తిరిగి అదిరిపోయే సెటైర్ వేశాడు. తర్వాత తేజ మాట్లాడుతూ సమంత ఇలా ఎందుకు మాట్లాడుతుందో తెలుసా? మీకు.. ఒకప్పుడు సమంత రూత్ ప్రభు ఆమె.. కానీ బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత సమంత రూడ్ ప్రభు అయిపోయింది అంటూ సెటైర్ వేశాడు.












Click it and Unblock the Notifications