రానాపై చేయిచేసుకున్న స్టార్ హీరోయిన్?

సినిమా పరిశ్రమలో కొందరు హీరోయిన్స్ కొందరు హీరోలతో చనువుగా ఉంటారు. ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకునేవారే ఎక్కువగా ఉంటారు. కొంతమంది బాలీవుడ్ హీరోయిన్లు తమ మనసులో ఏదో పెట్టుకొని హీరోలు మాట్లాడినదాన్ని తప్పు పడుతుంటారు. ఏదైనా ఈవెంట్లో కానీ పార్టీలో కానీ బాలీవుడ్ హీరోయిన్స్ కి టాలీవుడ్ హీరోలు కనపడితే వాళ్ళని ఎలా అవమానించాలనే చూస్తుంటారు.

ప్రస్తుతం అలాంటి మాయలకు రానా దగ్గుబాటి బలైపోయాడంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. ఈ వార్త ప్రకారం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రొడ్యూసర్ పుట్టినరోజు వేడుకకు రానా హాజరయ్యాడు. ఆ పార్టీలో తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఎక్కువమంది పాల్గొన్నారు. అందరూ ఒకరితో మరొకరు సరదాగా ముచ్చటించుకుంటున్నారు. అలాగే రానా కూడా ఒక బాలీవుడ్ హీరోయిన్ ను ఆటపట్టిస్తూ సరదాగా మాట్లాడారు.

rana daggubati latest news on trending

ఆటపట్టించే క్రమంలో రానా వాడిన ఓ పదం ఆమెను చాలా హర్ట్ అయ్యేలా చేసిందంట. హర్టయ్యాననే విషయాన్ని చెప్పకుండా నేరుగా రానా దగ్గరకు వచ్చి లాగిపెట్టి చెంపమీద కొట్టిందంట. అసలు ఆయన మాట్లాడింది తప్పు కాకపోయినప్పటికీ ఆమెకు ఎందుకు అంత కోపం వచ్చింది? బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినంతమాత్రాన అలా వ్యవహరిస్తుందా? అంటూ తెలుగు సినీప్రేమికులు ఫైరవుతున్నారు.

అసలు రానా ఆ పార్టీకి వెళ్లకుండా ఉండాల్సిందని, బాలీవుడ్ అంటేనే తలబిరుసుతనం ఉన్న భామలు ఉంటారని మండిపడుతున్నారు. రానా ఆ పార్టీకి వెళ్లకుండా ఉంటే ఆయనకు ఇంత అవమానం జరిగేది కాదని చెబుతున్నారు. వాస్తవానికి ఈ వార్త నిజమా? అబద్దమా? అనేది స్పష్టత రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+