Ranabaali first review: విజయ్ దేవరకొండ 'రణబాలి' మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే..

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హిట్లు ప్లాఫ్ లతో సంబంధం లేకుండా సినిమా చేసుకుంటూ వెళ్తున్నారు. గతేడాది కింగ్డమ్, అంతకుముందు ది ఫ్యామిలీ స్టార్ సినిమాలతో అలరించారు. కానీ అవి బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయాయి. అయితే ఈ ఏడాది విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'రణబాలి'.. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన రణబాలి టీజర్, ట్రైలర్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సారి విజయ్ దేవరకొండ కమ్ బ్యాక్ పక్కా అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా రిలీజ్ కు ముందే పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో టాక్సీవాలా, శ్యామ్ సింగా రాయ్ సినిమాలను తెరకెక్కించారు. ఆ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి.

విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. విజయ్- రష్మిక వివాహం జరిగిన తర్వాత వస్తున్న తొలి సినిమా కావడంతో వీరిద్దరి కెమిస్ట్రీని తెరపై చూసేందుకు అభిమానులు తెగ ఆత్రుతగా ఉన్నారు. గతంలో విజయ్- రష్మిక కాంబినేషన్ లో గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రణబాలి మూవీ కథా నేపథ్యం 1870 నాటికాలంలో సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమైతుంది. అప్పట్లో రాయలసీమ ప్రాంతంలో ఏర్పడిన కరవు కాలం నేపథ్యంలో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించారు. ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తమ ప్రజలను కాపాడే యోధుడు సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో విజయ్ కనిపించనున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ ద్వయం అజయ్ - అతుల్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ లో ఈ జోడీ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్దిరిపోయింది. ఈ చిత్రాన్ని టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది.

Ranabaali movie first review out starring Vijay Deverakonda and rashmika mandanna Ranabaali movie

అయితే రణబాలి సినిమాకు సంబంధించిన ప్రివ్యూ షో ను తాజాగా ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రదర్శించారు మేకర్స్. అక్కడి నుండి లీకైన టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రణబాలి మూవీ విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ఒక గొప్ప ల్యాండ్ మార్క్ ఫిల్మ్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. థియేటర్స్ లో కూర్చొన్న ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే సన్నివేశాలు ఈ చిత్రం లో చాలానే ఉన్నాయని టాక్. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుంచి.. ప్రీ క్లైమాక్స్.. క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాల్ని ప్రేక్షకులు అంత తేలికగా మర్చిపోలేరని అంటున్నారు. రణబాలి మూవీలో విజయ్ దేవరకొండ నట విశ్వరూపం చూపించారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి విజయ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ ఖాయమంటూ టాక్ నడుస్తోంది. ఇక ఫుల్ రివ్యూ కోసం అక్టోబర్ 16 వరకు ఆగాల్సిందే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+