మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న రణబీర్, రష్మిక..!
సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీ ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే..! ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలువడమే కాకుండా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన సంగతి కూడా తెలిసిందే. ఇక, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్‌కపూర్, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సిల్వర్ స్ర్కీన్‌పై సూపర్ జోడి కాంబినేషన్ సెట్ అయ్యింది. అయితే, ఈ హిట్ కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఈ వార్త విన్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అయితే, వీరిద్దరూ స్ర్కీన్ షేర్ చేసుకునేది సినిమా కోసం కాదు. ఓ కమర్షియల్ యాడ్ కోసం అని తెలిసింది. సాప్ట్ డ్రింక్ 7UPయాడ్‌లో రణబీర్, రష్మిక కలిసి సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాఫ్ట్ డ్రింక్ సెవెన్ అప్ యాడ్‌లో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సెవెన్ అప్ యాడ్‌కు సంబంధించిన రెండు వేర్వేరు వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక, ఈ వీడియోలో ఖండాలా వాటర్ ఫాల్ ఎక్కడా అని అడగ్గా, వెంటనే రణబీర్ కపూర్ సెవెన్ అప్ బాటిల్ ఇస్తాడు. రష్మిక సెవెన్ అప్ తాగగానే వర్షం పడుతుంది. మరో యాడ్ వీడియో కూడా సేమ్ ఇలానే ఉంటుంది.

పలు ప్రాజెక్టులతో బిజిగా ఉన్న రష్మిక..
ఇక, యానిమల్ పార్క్ ప్రిన్సిపల్ ఫొటోగ్రఫీ 2026లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా, బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, నటి రష్మిక ప్రస్తుతం తమ తమ షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. రష్మిక చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఈ ఏడాది రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నపుష్ప 2. దీంతో పాటు ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇంకా పలు సినిమాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రణ్ బీర్ కపూర్ బ్రహ్మాస్ర ప్రాంఛైజీలో కనిపించాల్సి ఉండగా, ఈ సినిమాపై తాజా అప్‌డేట్ రాలేదు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications