ఘాటైన లిప్ లాక్‌తో రెచ్చిపోయిన రష్మిక
లిప్ లాక్ అనగానే తెలుగు ఇండస్ట్రీలో అందరికి ఠక్కున గుర్తుకు వచ్చేది రౌడీ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ లాక్‌లతో విజయ్ దేవరకొండ రెచ్చిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమాలో ఎన్ని లిప్ లాక్‌లు ఉన్నాయో కనిపెట్టడం కాస్తా కష్టమే. ఈ సినిమాకు సందీప్ వంగా దర్శకత్వం వహించాడు. అర్జున్ రెడ్డిని హిందీలో కూడా తెరకెక్కించి భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
టాలీవుడ్‌ను పక్కన పెట్టి మరి బాలీవుడ్‌లోనే సందీప్ వంగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆయన ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న సినిమా 'యానిమల్'. రణబీర్ కపూర్, రష్మిక మందన ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. రణబీర్ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా 'యానిమల్' టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. యానిమల్ తండ్రికొడుకుల మధ్య సాగే గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతుంది. అలాగే మేకింగ్‌లో కూడా పూర్తిగా కొత్తదనం కనిపిస్తోంది.

తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్‌ను విడుదల చేశారు. రణ్‌బీర్, రష్మిక ఇద్దరూ ఓ మినీ ప్లేన్‌ను నడుపుతూ.. లిప్ లాక్ చేసుకుంటున్న పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది. రణ్‌బీర్, రష్మిక ఘాటైన లిప్ లాక్‌తో రెచ్చిపోయారు. ఈ పోస్టర్‌ను చూసిన నెటిజన్లు .. అర్జున్ రెడ్డిని తిరిగి గుర్తు చేసినట్టు ఉందని కామెంట్ చేశారు. ఇక ఈ సినిమాలో 'అమ్మాయి' అంటే సాగే మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications