Johnny Master: జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్.. నాలుగు రోజులే..!
అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ ను లైంగికంగా వేధించిన కేసులు అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ వచ్చింది. డ్యాన్స్ మాస్టర్ గా జానీ మాస్టర్ కు జాతీయ అవార్డు వచ్చింది. అవార్డు తీసుకోవడానికి ఆయన వెళ్లాలి. దీంతో రంగారెడ్డి కోర్టులో జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన కోర్టు షరతులతో కూడినమధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ.2ల పూచికత్తుతో బెయిల్ గ్రాంట్ చేసింది. అయితే బెయిల్ 10 తేదీ వరకే ఇచ్చింది. ఆ తర్వాత జానీ మాస్టర్ కోర్టు హాజరు కావాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
జానీ తనపై అత్యాచారం చేశాడని మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు జానీ మాస్టర్ 2017లో పరిచయం అయ్యారని బాధితురాలు తెలిపారు. జానీ మాస్టర్ గ్రూపులో 2019 చేరినట్లు పేర్కొన్నారు. ఓ పాట షూటింగ్ కోసం ముంబై వెళ్లామని.. అక్కడ తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశారని ఫిర్యాదులో తెలిపింది. జరిగిన విషయం ఎవరికైనా చెబితే.. సినీ పరిశ్రమలో లేకుండా చేస్తానని బెదిరించినట్లు వివరించారు. తనను సొంత పని చేసుకోకుండా అడ్డుకున్నాడని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నమోదు చేశారు.

376, ఫోక్సో చట్టం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న జానీ మాస్టర్ ను గోవాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ కు తరలించారు. ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచారు. నాలుగు రోజులు పోలీసు కస్టడీ కోరారు. దీంతో కోర్టు కస్టడీకి అనుమతించింది. పోలీసులు నాలుగు రోజుల పాటు జానీ మాస్టర్ విచారంచారు. మళ్లీ కోర్టులో హాజరు పరిచి చంచల్ గూడ జైలుకు తరలించారు. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌కు ఇటీవల జాతీయ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే కోర్టు జానీ మాస్టర్ కు బెయిల్ ఇచ్చింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications