అతనితో పిల్లల్ని కనాలని ట్రై చేశా ...నా ప్లాన్ వర్కౌట్ కాలేదు - స్టార్ హీరోయిన్

నీ నటుల జీవితాలు పైకి బాగానే కనిపిస్తాయి. కానీ తెర వెనుక వారి జీవితాల్లో కూడా ఎన్నో కష్టాలు, సమస్యలు ఉంటాయనే విషయం చాలామందికి తెలియదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రాణి ముఖర్జీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఉన్న విషాదం గురించి వెల్లడించింది. 1990లో బాలీవుడ్‌లో రాణి ముఖర్జీ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోస్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పిక్ టైంలోనే నిర్మాత ఆదిత్య చోప్రాను పెళ్లాడింది. పెళ్లి తర్వాత రాణి ముఖర్జీ సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

రాణి ముఖర్జీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏడేళ్లుగా తాను మనసులో ఉన్న విషాదాన్ని చెప్పుకుని బాధపడింది. దాదాపు ఏడేళ్లుగా తాను రెండవ బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నానని.. కానీ ఇప్పటికీ అది సాధ్యం కావడం లేదని ఆమె తెలిపింది. నా కుమార్తెకు ఇప్పుడు ఎనిమిదేళ్లు. ఆమెకు ఒకటిన్నర వయసు ఉన్నప్పుడు నుంచి రెండవ బిడ్డ కోసం ప్రయత్నించాను.. కానీ కుదరలేదు. గతంలో మరోసారి ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండలేదు. నాకు గర్భస్రావం జరిగింది. దీంతో కడుపులోనే రెండో బిడ్డను కోల్పోయాను.

Rani Mukerji reveals she tried to have a second baby for seven years

ఇప్పుడు నా వయసు 46 సంవత్సరాలు. ఇప్పుడు నేను బిడ్డను కనే పరిస్థితిలో లేను. నా కుమార్తెకు.. చెల్లిని, లేదా తమ్ముడిని ఇవ్వలేకపోయాననే బాధ ఇప్పటికీ వేధిస్తుంది. కానీ మనకు లభించిన దానితో మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే విషయాన్ని తెలుసుకున్నాను. నా కూతురుతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. బిడ్డను కనే వయసు దాటాను. ఇప్పుడు నాకు నా కూతురు అధిర ఒక్కరు చాలంటూ చెప్పుకొచ్చింది. కానీ తన మొదటి బిడ్డకు తోబుట్టువులను ఇవ్వలేకపోయాయనే బాధ ఎప్పటికీ ఉంటుందని రాణి ముఖర్జీ తెలిపింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+