పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన రణ్‌వీర్ సింగ్..దీపికా పదుకొనేతో బంధం చెడిందా..?
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.
తమ లైఫ్ పార్టనర్‌తో రాజీ పడకపోవడం అత్తింటి గొడవలు ,పెళ్లి తరువాత కూడా కెరీర్ కొనసాగించడం, పర్సనల్ లైఫ్‌ను మెయిన్‌టైయిన్ చేయడం మొదలగు కారణాలతో సెలబ్రిటీలు విడాకులు బాట పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ జంట విడాకులు తీసుకుంటారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

రణ్‌వీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలను డిలీట్ చేశాడు. దీంతో ఈ జంట విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారనే ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. అయితే దీపికతో కలిసి ఉన్న ఫొటోలు ఉన్నప్పటికీ పెళ్లి ఫొటోలు అలాగే ఉంచడం అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. వీరిద్దరు మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకోబోతున్నారా? లేక పొరపాటు వల్ల ఫొటోలు డిలీట్ అయ్యాయా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పైగా దీపిక ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో రణ్‌వీర్ ఇలా పెళ్లి ఫొటోలు తొలగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై రణ్‌వీర్ క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం ఏంటో తెలియదు.












Click it and Unblock the Notifications