స్టార్ హీరోయిన్‌గా ఉండి నోరు జారిన రష్మిక!

నేషనల్ క్రష్ రష్మిక నుంచి తాజాగా హిందీ సినిమా చావా విడుదలైంది. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్ జీవిత కథను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉత్తరాదిన, ప్రధానంగా మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ ను దైవంగా కొలుస్తారు. అటువంటి శివాజీ తనయుడి జీవిత కథతో సినిమా రావడంతో ఎలా ఉంటుందా? అనే ఆసక్తి సినీ ప్రియుల్లో రేకెత్తింది. శంభాజీగా విక్కీ కౌశల్, అతని భార్య యేసు బాయిగా రష్మిక నటించారు. తమ రాజ్యాన్ని శత్రువుల నుంచి కాపాడుకుంటూనే రాజ్య విస్తరణ ఎలా చేయాలనేదానిపై భార్యతో కలిసి ప్రణాళికలు రచిస్తుంటాడు. మొఘలులు తమకు అడ్డుగా ఉన్నాడని శంభాజీని అడ్డు తొలగించుకోవాలనుకుంటారు.

ధన్యవాదాలు తెలిపిన రష్మిక
అందుకోసం వారు ఎంచుకున్న విధానమే సినిమాగా రూపుదిద్దుకుంది. శంభాజీని వెన్నుపోటు పొడుస్తారు. ఆయన లేని సమయంలో మహారాణిగా రష్మిక రాజ్యం మొత్తాన్ని సంరక్షించే బాధ్యత తీసుకుంటారు. విక్కీ కౌశల్ అద్భుతంగా నటించాడంటూ సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు. తొలిరోజు ఈ సినిమా రూ.31 కోట్లు సాధించి రూ.100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ముంబయిలో సినిమా ప్రమోషన్స్ లో రష్మిక పాల్గొని మాట్లాడింది. తాను హైదరాబాద్ నుంచి వచ్చినప్పటికీ ముంబయి ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారంటూ, అందుకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఇక్కడి ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది.

rashmika comments on chhaava movie promotion event in Mumbai

కర్ణాటక నుంచి హైదరాబాద్ కు ఎప్పడు మారిందో?
రష్మిక మాట్లాడిన మాటలపై కన్నడ ప్రజలు మండిపడుతున్నారు. అప్పుడే తాను పుట్టి పెరిగిన ప్రాంతం, సొంత ఊరు, తనకు జీవితాన్నిచ్చిన కన్నడ పరిశ్రమను మర్చిపోయిందంటూ నిప్పులు చెరుగుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా విరాజ్ పేట్ రష్మిక సొంత ఊరు. విరాజ్ పేట నుంచి రష్మిక హైదరాబాద్ కు ఎప్పుడు మారిందని ప్రశ్నిస్తున్నారు. దీనిపై రష్మిక ఎలా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది. గతంలో కూడా రెండు మూడు సందర్భాల్లో తెలుగు సినీ పరిశ్రమే తన పుట్టిల్లుగా పేర్కొంది. అప్పుడు కూడా కన్నడ ప్రజలు రష్మికపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఛలో సినిమాద్వారా కన్నడం నుంచి తెలుగుకు పరిచయమైన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+