పాన్ ఇండియా స్టార్ హీరో చేతిలో రష్మికకు ఘోర అవమానం..!!
నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిరిక్ పార్టీ అనే చిన్న కన్నడ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీలో సినిమాలు చేస్తోంది. దాదాపుగా ఆమె చేసే సినిమాలన్నీ సూపర్ హిట్లుగా నిలుస్తుండటంతో రెమ్యునరేషన్ తోపాటు డిమాండ్ కూడా రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. తాజాగా పుష్ప2తో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. దీనికి ముందు యానిమల్ సినిమాతో ఘనవిజయాన్ని అందుకుంది.
అతనికి బ్రేకప్ చెప్పేసి..
రోజురోజుకు క్రేజ్, ఇమేజ్ పెంచుకుంటూ వెళుతోన్న రష్మికకు పాన్ ఇండియా స్టార్ హీరో చేతిలో ఘోర అవమానానికి గురైంది. ఈ అవమానానికి సంబంధించి సాక్ష్యాలున్నాయంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కన్నడంలో కిరిక్ పార్టీ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడ్డారు. తర్వాత నిశ్చితార్థం కూడా జరిగింది. కాలక్రమంలో నిశ్చితార్థాన్ని రద్దుచేసుకున్నారు. తెలుగు సినిమాల నుంచి భారీ అవకాశాలు వస్తుండటంతో నిశ్చితార్థానికి, పెళ్లికి గుడ్ బై చెప్పేసి తెలుగు పరిశ్రమలో స్థిరపడ్డారు. రక్షిత్ శెట్టికి బ్రేకప్ చేప్పేసింది.

కర్ణాటకలో రష్మికపై తీవ్ర వ్యతిరేకత
అనంతరం జరిగిన కొన్ని పరిణామాలు రష్మికపై కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర వ్యతిరేకతను కలిగించాయి. ఆ తర్వాత కన్నడంలో సినిమాలు చేయలేదు. తాజాగా కిరిక్ పార్టీ విడుదలై 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కాంతార హీరో రిషభ్ శెట్టి అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే తాను కృతజ్ఞతలు తెలియజేసే క్రమంలో ఎక్కడా రష్మిక పేరును ఉపయోగించలేదు. అంతేకాదు తాను షేర్ చేసిన సినిమా పోస్టర్ లో రష్మిక ఫొటో ను కూడా తొలగించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వివాదాస్పదంగా మారింది. కన్నడ పరిశ్రమకు చెందిన రిషభ్ శెట్టి సినిమాలను దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అటువంటిది రష్మిక ఫొటో తొలగించడం అతని అహంకారానికి నిదర్శనంగా మారిందంటూ రష్మిక అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఆమెకు సరైన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications