లేడి ఓరియెంటెడ్ మూవీలో రష్మిక.. సినిమా పేరేంటో తెలుసా..
గీతాగోవిందం సినిమాతో మంచి ఇమేజ్‌ను సొంత చేసుకున్న రష్మిక మందన్న ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజి అయిపోయింది. ఫుష్ప సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ రష్మిక హావా కొనసాగుతుంది. రణబీర్‌కపూర్‌తో కలిసి యానిమల్ సినిమాలో సందడి చేయనుంది. ఇక టాలీవుడ్‌లోనూ పుష్ప2 సినిమాతో బిజిగా ఉంది. ఇక చేతినిండా సినిమాలతో రష్మిక కెరీర్ దూసుకుపోతుంది. తాజాగా లేడి ఓరియెంటేడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ బ్యూటీ. ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో చేయబోతుంది.
ది గర్ల్ ఫ్రెండ్ సినిమా..:వరుస సినిమాలో ఫుల్ బిజి అయిపోయిన రష్మిక మరో లేడి ఓరియెంటెడ్ మూవీకి సిద్ధమవుతుంది. ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో రష్మిక కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాకు యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించననున్నారు. అందాల రాక్షసి సినిమాతో నటుడిగా పరిచయమైన రాహుల్ అందరికి గుర్తుండే ఉంటాడు. ఆ సినిమా తర్వాత తెలుగులో ఓ రెండుమూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు రాహుల్. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా గీతా ఆర్ట్స్‌బ్యానర్ లో రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన ఒక చిన్న వీడియోను రష్మిక సోషల్‌మీడియాలోని తన ఖాతాలో షేర్ చేసింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో ఒక అబ్బాయిని ఎంతగానో ప్రేమించే అమ్మాయి పాత్రలో రష్మిక కనిపించనుంది. ఈ సినిమాకి అబ్దుల్ వాహబ్ సంగీతం అందించనున్నారు. ఇంతకుమందు ఈయన ఖుషి సినిమాకి సంగీతం అందించారు.

యానిమల్ సినిమా డిసెంబర్‌లో..:ప్రస్తుతం రష్మిక చేతిలో బోలెడన్నీ సినిమాలున్నాయి. పాన్ ఇండియన్ మూవీ పుష్క 2 లో నటిస్తోంది. అలాగే రెయిన్‌బో సినిమాలోనూ హీరోయిన్‌గా చేస్తుంది. ఈ సినిమా అటు తెలుగులో, ఇటు తమిళంలోనూ రాబోతుంది. ఇంకా, బాలీవుడ్ నటుడు విక్కీ కౌషల్‌తో కలిసి నటించేందుకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పడేమో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. రణబీర్ కపూర్ తో కలిసి 'యానిమల్' సినిమాలో నటించింది. ఈ సినిమాలో డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications