ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ జాబితాలో రష్మిక మందన్న..కంగ్రాట్స్ చెప్పిన విజయ్...
నేషనల్ క్రష్ రష్మికకు అరుదైన గౌరవం లభించింది. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ '30 అండర్ 30' జాబితాలో ఈ భామకు చోటు లభించింది. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు వరుస హిట్ సినిమాలతో యూత్ మనసులను దోచేసుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో అల్లు అర్జున్ పుష్ప2లో నటిస్తోంది. ఇదిలా ఉండగా, రష్మిక ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా జాబితాలో చోటు సంపాదించుకుని మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఈ సందర్భంగా సినీ నటుడు విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా రష్మికకు శుభాకాంక్షలు తెలిపాడు. రష్మిక మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్టు విజయ్ తెలిపాడు. ''నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఇలాగే నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి'' అంటూ విజయ్ పోస్ట్ పెట్టాడు. ఇక, రష్మిక మందన్నాకు లభించిన ఈ అరుదైన గౌరవంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు.

ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ వివిధ రంగాల్లో తమదైన ముద్రవేసిన 30 ఏళ్లలోపు యువతీయువకుల కోసం '30 అండర్ 30' జాబితాను ప్రవేశపెడుతుంది. 2024 యంగ్ డిస్ట్రప్టర్స్, ట్రైల్‌బ్లేజర్స్ కేటగిరిలో నేషనల్ క్రష్ రష్మిక చోటు దక్కించుకున్నట్లు ఫోర్బ్స్ ఇండియా తాజాగా వెల్లడిచేసింది. ఇక, ఈ సంవత్సరానికి నేషనల్ క్రష్ రష్మికతో పాటు మరో ముగ్గురు నటీమణులకు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

తనకు లభించిన ఈ అరుదైన ఘనత గురించి రష్మిక మొదటిసారిగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ ఫొటోను షేర్ చేసిన రష్మిక తన ఫ్యాన్స్‌కు అభినందనలు తెలిపింది. ఇక, ఇదే పోస్ట్‌ను టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ కూడా షేర్ చేస్తూ రష్మికకు శుభాకాంక్షలు తెలిపాడు.

వరుస సినిమాలతో బిజి అయిపోయిన రష్మిక...
ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజిగా ఉంది. బాలీవుడ్లో విక్కీ కౌశల్ తో చావ సినిమాలో నటిస్తోంది. ఇక, ఈ సినిమా పీరియాడిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతుంది. బాలీవుడ్‌తో పాటు తమిళ్‌లో కూడా ఈ అమ్మడు ఓ సినిమా చేయబోతుంది. అది కూడా ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో... దీంతో పాటు రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాల్లో నటిస్తుంది. తెలుగులో పుష్క 2 సినిమా చేస్తోంది.












Click it and Unblock the Notifications