గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక..శుభతరుణం రాబోతోందంటూ

ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే.. రష్మిక మందన్నా అనే చెప్పాలి. ఆ మధ్య కాస్తా శ్రీలీల హడావిడి చేసినప్పటికీ...ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలపై ఫ్లాప్ హీరోయిన్‌గా ముద్ర పడింది. దీంతో తెలుగులో స్టార్ హీరోయిన్‌ ఎవరంటే మాత్రం రష్మిక పేరే అందరూ చెబుతున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్నానే టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు.

రష్మిక మందన్నా నటించిన సినిమాలు బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. కిర్రాక్ పార్టీ,భీష్మ,సరిలేరు నీకెవ్వరు, గీతగోవిందం, పుప్ప,
పుష్ప-2, సీతారామం, యానిమల్, కుబేర వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అలాగే బాలీవుడ్‌లో కూడా ఈ బ్యూటీ సత్తా చాటింది. విక్కి కౌషల్‌‌తో నటించిన చావా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.

Rashmika Mandanna Instagram post goes viral

ఇక రష్మిక నటిస్తున్న సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. మైసా ,ది గర్ల్‌ఫ్రెండ్ ,థామా,కాక్‌టెయిల్ 2 వంటి సినిమాల్లో నటిస్తోంది.ఇదిలా ఉంటే రష్మిక తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. రష్మిక తన పోస్ట్‌లో "మీ గుండె వేగంగా కొట్టుకుంటున్నప్పుడు, మీ చేతులు వణుకుతున్నప్పుడు, మీ బుగ్గలు నవ్వుతూ నొప్పిగా ఉన్నప్పుడు ఆ అనుభూతి మీకు తెలుసా?? అవును... ఇప్పుడు నేను 🩷🩷 ఎందుకంటే చాలా చాలా ప్రత్యేకమైనది రాబోతోంది.." అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైనశైలిలో రియాక్ట్ అవుతున్నారు.ఆమె విజయ్ దేవరకొండ‌తో ఉన్న రిలేషన్‌షిప్ గురించి పరోక్షంగా ప్రస్తావించిందని వారు అభిప్రాయపడుతున్నారు.ఈ వార్త విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య మరింత ఆసక్తిని రేకెత్తించింది.గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికల మధ్య ఎఫైర్ నడుస్తుందనే రూమార్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' 'సినిమాలో మొదటిసారి కలిసి నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది.

ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' సినిమాతో మరోసారి మ్యాజిక్ చేయాలని చూసినప్పటికీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. విజయ్ దేవరకొండ, రష్మిక కెమిస్ట్రీ మాత్రం అదిరింది. ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించారు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి మరో సినిమాలో కనిపించలేదు. కానీ..తెర బయట మాత్రం ఈ జంట కను విందు చేస్తూనే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+