వారిద్దరినీ రిక్వెస్ట్ చేసిన రష్మిక!

రష్మిక కెరీర్ ఎలా ఉందంటే.. సూపర్ అని చెప్పలేం.. అలాగే బాలేదు అనికూడా చెప్పలేం. అలా నడుస్తూ ఉంది. ప్రస్తుతం చేతిలో సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప ది రూల్ లో నటిస్తోంది. ఈ సినిమాపై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. అయితే ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ ను సరిగా ఉపయోగించుకోలేకపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలుగులో మంచి సినిమాలు చేసే సమయంలో ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు ఒప్పుకుంది. అదే తెలుగులోనే మంచి సినిమాలను ఎంపిక చేసుకొనివుంటే బాగుండేదంటున్నారు. బాలీవుడ్ మీద ఆసక్తితో ఎక్కువగా అక్కడే ఫోకస్ పెట్టింది. అయితే వరుస పరాజయాలు ఆమెను పలకరించాయి. బాలీవుడ్ లో ఇప్పుడు రష్మిక ఆశలన్నీ యానిమల్ సినిమామీదే పెట్టుకుంది. రణబీర్ కపూర్ హీరో కాగా, ఈ చిత్రానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

rashmika mandanna request directors sukumar and sandeep vanga

సందీప్ రెడ్డి తన తర్వాత సినిమాను ప్రభాస్ హీరోగా చేయబోతున్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది జూన్ లేదా జూలై నుంచి సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో అవకాశం కల్పించమని రష్మిక సందీప్ రెడ్డిని కోరుతోందంట. యానిమల్ సినిమాలో సందీప్ చెప్పినదాని ప్రకారం నటించి ఆయన మెప్పును పొందింది.

సుకుమార్ ని కూడా తన తర్వాత సినిమాలో అవకాశం ఇవ్వమని అడుగుతోందంటున్నారు. పుష్ప 1 లో సుకుమార్ చెప్పినట్టుగా డీ గ్లామర్ రోల్ చేసింది. కాస్త స్కిన్ షి చేసి మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ఈ రెండు మినహా భవిష్యత్తులో మరో చిత్రమేదీ రష్మికది కనపడటంలేదు. సందీప్ రెడ్డి, సుకుమార్ కనుక తమ తర్వాత సినిమాల్లో కూడా అవకాశం కల్పిస్తే ఒడ్డున పడుతుంది అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+