రోజంతా విజయ్ సార్ నాతోనే ఉంటారా? అభిమానికి రష్మిక ఫన్నీ రిప్లయ్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మైసా. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ సాయపురెడ్డి, అనిల్ సాయపురెడ్డి, వీరసాయిరెడ్డి గోపలు నిర్మిస్తున్నారు. ఈశ్వరి రావు, రాహుల్ రవీంద్రన్, సముద్రఖని, రావు రమేశ్, శివ కందుకూరి, కార్తీక్ రంజినీ, తారక్ పొన్నప్ప, నిధి సింగ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్, శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. నవంబర్ 27న మైసా సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మైసా టీజర్ రిలీజైంది. ఈ సందర్భంగా రష్మిక మందన్న మాట్లాడుతూ విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నేను ఏదైనా కొత్త సినిమా చేస్తే ఖచ్చితంగా కొత్త ఎలిమెంట్ ఉండాలి అనుకుంటా.. ఈ టీజర్‌తో మీరు సర్‌ప్రైజ్ అయ్యారా? గర్ల్‌ఫ్రెండ్ మూవీలో ఎమోషనల్‌గా ఎంత కావాలో ఇచ్చేశా. ఇప్పుడు మైసాలో నా లైఫే ఇచ్చేశా. నాతో ఏమేం చేయించారో తెలుసా? స్క్రిప్ట్ చదివేటప్పుడు భలే ఉంది అనిపించింది, మనం చేద్దాము అని ఆలోచిస్తాం కానీ అది రియాలిటీలోకి రావాలంటే చాలా ఉంటుంది. స్టోరీ విన్నప్పుడు చేసేద్దాం అనుకున్నా.. కానీ కేరళలో షూటింగ్ చేసేటప్పుడు ఓ కొండ మీదకి పరిగెత్తుకుంటూ వెళ్లమన్నారు. రాళ్లు ఉంటాయి.. ఏమైనా జరగరానిది జరిగితే నాకు చాలా కమిట్‌మెంట్స్ ఉన్నాయి.. కానీ డైరెక్టర్ మాత్రం రియాలిటీ కావాలని చేయించాడు. 90 అడుగుల ఎత్తైన వాటర్ ఫాల్ నుంచి జంప్ అంటే ఎట్లా? నాకు కింద చూడాలంటేనే చాలా భయం.. అలాంటిది అంత ఎత్తైన వాటర్ ఫాల్ నుంచి దూకమంటే రోజంతా వణికిపోయానని రష్మిక గుర్తుచేసుకున్నారు.

Rashmika Mandanna Reveals Her Toughest MySaa Shoot Gives Funny Reply About Vijay Deverakonda

సెట్‌కి వెళ్తే డైరెక్టర్ ఏం చెబుతారో? ఏం అడుగుతారోనని జీవితంలో ఫస్ట్ టైం భయపడ్డా. దాంతో పాటు అండర్ వాటర్ ఫైట్ అని చెప్పారు. నాకు కొంచెం స్విమ్మింగ్ వచ్చు కాబట్టి ఈజీగా ఉంటుందని అనుకున్నా. కానీ 8 గంటల షూటింగ్ చేయాలంటే 8 గంటలు కింద ఉండాలట? ఎలా అండి నేనేమైనా చేపనా? కష్టం కదా? ఇవన్నీ చేశా. తర్వాత బురదలో ఫైట్ కోసం నా శరీరం నిండా బురద పోసేశారు.. నేను నడవలేకపోతుంటే రియాలిటీ కావాలని అడిగారు. అయినప్పటికీ చేసుకుంటూ వచ్చేశాను.. ఇంకా 12 రోజులు షూటింగ్ ఉంది.. ఆయన ఏం అడుగుతారోనని రష్మిక పేర్కొన్నారు.

నేను ఎన్నో సినిమాలలో డ్యాన్స్ చేశా.. ఈ సినిమాలో డ్యాన్స్ చేసేటప్పుడు నా నడుం 10 సార్లు బ్రేక్ అయ్యింది. డాక్టర్ దగ్గరికి వెళితే.. ఇదేదో ఫుట్‌బాల్ ప్లేయర్ స్కాన్ చూసినట్లుగా ఉంది, ఇది యాక్టర్ స్కాన్‌లా అనిపించడం లేదని చెప్పారు. మా డైరెక్టర్ వినరు .. మీరే ఎలాగోలా ఫిక్స్ చేయండి అని డాక్టర్‌కు చెప్పా. ఇంకోక 3 వారాలలో గాయం తగ్గిపోతుందనుకుంటా. రిలీజ్ డేట్ నాటికి ఇంకా చాలా స్టోరీస్ తీసుకుని వస్తా. ఇన్‌స్టాలో అప్‌డేట్స్ ఇవ్వడానికి టైం కుదరడం లేదు. లుక్ రివీల్ చేయకూడదని ఒక డైరెక్టర్ చెప్పారు, ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేయలేదు, షూటింగ్ చేసేటప్పుడు నా చేతిలో ఏం లేదు కదా? అని రష్మిక అన్నారు.

ఇదే సమయంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ సార్‌తో రావాలని అభిమానులు అడగ్గా.. ట్రైలరేనా? ప్రీ రిలీజ్‌కి రావొద్దా? రోజంతా సార్ నాతోనే ఉంటారా? రష్మిక ఫన్నీగా స్పందించారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చినందుకు థ్యాంక్స్. ఈ టీజర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు మైసా సినిమా కూడా నచ్చుతుంది. మీ కోసం ఎంతైనా కష్టపడతాను. మాటల్లో కంప్లయింట్ చేస్తాను కానీ, ఒక డైరెక్టర్ సార్ విజన్‌తో వస్తే నేను ఏదైనా చేస్తాను, వాళ్ల విజన్‌ను సపోర్ట్ చేయాలి కదా? అని రష్మిక వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+