అతనితో శృంగారం చేయాలని ఉంది.. ఓపెన్ అయిన రష్మిక..!

పాన్ ఇండియా క్రష్ రష్మిక మందాన్న అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ అన్న తేడా లేకుండా వరుస సినిమాలు.. బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకెళ్తోంది. పుష్ప-1, పుష్ప-2, యానిమల్, ఛావా, ఇప్పుడు కుబేర వరుసగా హిట్ సినిమాలు చేస్తూ ఫుల్ క్రేజ్ పెంచుకుంటోందీ బ్యూటీ. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు హాట్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

రష్మిక కెరీర్ లో యానిమల్ మూవీ ఓ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో నటించింది. సందీప్ రెడ్డి వంగా ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఏకంగా రూ. 800 కోట్లు రాబట్టింది. ఈ మూవీతో బాలీవుడ్ లో రష్మిక క్రేజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో యానిమల్ తర్వాత వెంటనే ఛావా మూవీ ఆఫర్ రావడంతో ఓకే చెప్పింది. ఈ మూవీ కూడా భారీ విజయాన్ని అందుకుంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక కీలక కామెంట్స్ చేసింది. తాజాగా రష్మికను.. ఓ ఇంటర్వ్యూలో నిజ జీవితంలో యానిమల్ మూవీ హీరో పాత్ర స్వభావం ఉన్న వ్యక్తితో మీరు డేటింగ్ చేస్తారా? అతడిలో మార్పు తీసుకురాగలరా? అని ప్రశ్న వేయగా ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది. అలాంటి వ్యక్తితో డేటింగ్ చేయడానికి అభ్యంతరం లేదని పేర్కొంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

"మనం ప్రేమలో ఉంటే మార్పు కచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే భాగస్వామితో కలిసి ఉంటున్నప్పుడు వారితో కలిసి జీవితాన్ని పంచుకుంటున్నప్పుడు ఇద్దరి వ్యక్తిత్వాల్లో మార్పు రావడం సహజం. ఒకరికి ఒకరు అభిప్రాయాలు పంచుకుంటారు. ఇష్టాయిష్టాలు తెలుసుకుంటారు. ఒకరి కోసం ఒకరు మారతారు" అని పేర్కొంది.

Rashmika Mandanna s Bold Claim Would Date Ranbir s Toxic Animal Character

ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ధామా అనే హారర్ కామెడీలో నటిస్తోంది. ఈ మూవీతో పాటు ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి సిద్ధం అవుతోంది. అంతేకాక తాజాగా మైసా అనే చిత్రాన్ని ప్రకటించింది. ఈ మూవీలో శక్తివంతమైన పాత్రలో నటిస్తోంది రష్మిక. ఇక అట్లీ- అల్లు అర్జున్ సినిమాలోనూ రష్మిక నెగెటివ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+