మళ్లీ దొరికేశారుగా..! ఈసారి బ్యాండ్ బాజానే..!
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'కింగ్డమ్'. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించింది. సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. జులై 31న గ్రాండ్ గా విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ బజ్ ఏర్పడింది. విజయ్ యాక్షన్, అనిరుధ్ మ్యూజిక్ బాగుందని టాక్ వినిపిస్తోంది. దీంతో చాలా ఏళ్ల తర్వాత కొండన్నకు హిట్ పడిందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
I know how much this means to you and all those who love you 🥹❤️@TheDeverakonda !!
— Rashmika Mandanna (@iamRashmika) July 31, 2025
“MANAM KOTTINAM”🔥#Kingdom
అయితే విజయ్ కింగ్డమ్ పై స్టార్ హీరోయిన్ రష్మిక మందాన్న కీలక పోస్టు చేసింది. ఎక్స్ వేదికగా రష్మిక చేసిన ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. " నాకు తెలుసు.. ఈ సినిమా నీకు.. నిన్ను ప్రేమించేవారికి ఎంత ముఖ్యమైనదో అని. ఒక మంచి హిట్ కోసం ఎంతగా ఎదురుచూశావో, నిన్ను అభిమానించేవారికి కూడా తెలుసు. మనం కొట్టినమ్" అంటూ రష్మిక విష్ చేసింది. అయితే ఈ ట్వీట్ కు విజయ్ దేవరకొండ.. రిప్లై ఇచ్చాడు. 'మనం కొట్టినమ్' అంటూ ఓ హార్ట్ సింబల్ యాడ్ చేశాడు. దీంతో కొండన్న , రష్మిక ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రష్మిక ట్వీట్ నిమిషాల వ్యవధి లో వేల సంఖ్యలో లైక్స్, వందల సంఖ్యలో కామెంట్స్ వచ్చాయి. వీళ్లిద్దరు కలిసి రిలేషన్ లో ఉన్నారనే విషయం ప్రతీ ఒక్కరికి తెలిసిందే. చాలాసార్లు వీళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.
:,)
— Vijay Deverakonda (@TheDeverakonda) July 31, 2025
I wish i could share with you how i feel right now..
i wish you could all feel this with me..
Aah Venkanna Swami daya 🙏❤️
Mee Andari Prema ❤️❤️❤️❤️
Inka em kavali naa lanti okkadki 🥹 pic.twitter.com/WD54upPW4z
అయితే ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇంకా ఎంత కాలం ఇలా ఉంటారు అంటూ అభిమానులు వీళ్ళిద్దరిని సోషల్ మీడియా లో ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఈ సారి బ్యాండ్ బాజానే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాక ప్రస్తుతం రష్మిక.. విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉంటుందని సమాచారం అందుతోంది. అక్కడి నుండే ఆమె షూటింగ్స్ కి కూడా వెళ్తుందని టాక్. అంతేకాక ఇప్పుడు ఇద్దరూ కలిసి ఓ సినిమా కూడా చేస్తున్నారు. గతంలో వీళ్లు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి చిత్రాలు చేశారు.

'టాక్సీవాలా', 'శ్యామ్ సింగరాయ్' చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్.. విజయ్ దేవరకొండతో కొత్త సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. 'వీడీ 14' పేరుతో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications