నేను ఎవరిని పెళ్లి చేసుకుంటానో అందరికీ తెలుసు: రష్మిక
తెలుగు సినీ పరిశ్రమలో హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే వెంటనే అందరికీ రష్మిక పేరు గుర్తుకు వస్తుంది. అలాగే రష్మిక పేరు చెప్పగానే విజయ్ దేవరకొండ పేరు గుర్తుకువస్తుంది. అంతలా ఈ జంట తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి అందరూ ఫిదా అవ్వాల్సిందే. సోషల్ మీడియాలో ప్రతిరోజు వీరిద్దరికి సంబంధించిన వార్త ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, డేటింగ్ లో ఉన్నారని, పిక్నిక్ కు వెళ్లారని, విదేశాల్లో గడపడానికి వెళ్లారని ఇలా వార్తలు నిత్యం వస్తూనే ఉంటాయి.
అందరికీ తెలుసుగా
బయట వెకేషన్స్ కు వెళ్లినప్పుడు వారద్దరికి సంబంధించిన ఫొటోలు లీకయ్యాయి. తాజాగా వీరిద్దరూ ఓ రెస్టారెంట్ లో భోజనం చేస్తున్న ఫొటో బాగా వైరలైంది. రష్మిక ప్రస్తుతం పుష్ప2 సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలోని ఓ కళాశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రష్మికను యాంకర్ ఓ ప్రశ్న అడిగింది. మీరు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? లేదంటే బయట వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? అని అడ్డగా దానికి సమాధానంగా రష్మిక... తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ఆ విషయం అందరికీ తెలుంటూ స్వీట్ గ బదులిచ్చింది. రష్మిక నుంచి అలాంటి సమాధానం రాగానే అందరూ షాక్ అయ్యారు.

కనీసం నాకన్నా చెప్పండని అడిగిన యాంకర్
అందరికీ తెలుసని మీరు అంటున్నారుకానీ నాకు తెలియదు.. నాకన్నా చెప్పండి ప్లీజ్ అంటూ యాంకర్ రష్మికను అడుగుతుంది. నీకు తెలియదంటున్నావు కాబట్టి పర్సనల్ గా చెబుతానని నవ్వుతూ బదిలిచ్చింది. రష్మిక చెప్పింది విజయ్ దేవరకొండ గురించే అని, అందరికీ ఈ విషయం తెలుసని, ఎప్పుడూ స్పందించని రష్మిక ఈసారి అలా పరోక్షంగా సమాధానం ఇచ్చేసింది ఏమిటంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
రష్మిక, విజయ్ దేవరకొండ జంట కొన్నాళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారనే విషయం తెలిసిందే. పండగల సమయంలో రష్మిక విజయ్ ఇంటికి వెళుతుంది. విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు కూడా ఆమెను కొత్త కోడలిగా భావించి అతిథి మర్యాదలు చేస్తారు. మొత్తానికి కొన్నాళ్ల నుంచి సస్పెన్స్ గా ఉంచిన విషయాన్ని ఎట్టకేలకు రష్మిక స్పష్టంగా చెప్పింది. తాను త్వరలోనే విజయ్ ను పెళ్లి చేసుకోబోతున్నానని.












Click it and Unblock the Notifications