రష్మిక వీడియో వైరల్.. కొండన్న పెద్ద రింగే పెట్టేశాడుగా..!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాకు ఎంగేజ్ మెంట్ జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ ఎప్పటినుంచో డేటింగ్ లో ఉన్నట్లు అనేకసార్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఇటీవల హైదరాబాద్ లోని విజయ్ నివాసంలో అతికొద్ది మంది సన్నిహితులు, ఫ్యామిలీ మధ్య వీరి ఎంగేజ్ మెంట్ కార్యక్రమం పూర్తయినట్లు సమాచారం అందుతోంది. ఇక వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా నేషనల్ క్రష్ రష్మిక.. తన ఇన్ స్టాలో ఓ వీడియో పోస్టు చేసింది. తన పెంపుడు కుక్కతో సరదాగా గడుపుతోంది రష్మిక. అయితే ఈ వీడియోలో ఆమె చేతివేలికి ఓ రింగ్ తలతలా మెరుస్తూ కనిపిస్తోంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

అయితే రష్మిక చేతివేలికి ఉన్న ఉంగరం.. విజయ్ దేవరకొండ పెట్టిందేనని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొండన్న పెద్ద రింగే పెట్టాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తమ ఎంగేజ్ మెంట్ విషయాన్ని అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. విజయ్, రష్మిక కూడా ఎక్కడా దీనిపై మాట్లడలేదు. ఎంగేజ్ మెంట్ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి ఫొటోలు కూడా బయటకు రాలేదు.

ఇక విజయ్ దేవరకొండ, రష్మిక తొలిసారిగా 2018లో 'గీతా గోవిందం' మూవీ చేశారు. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రంతో విజయ్- రష్మిక రొమాంటిక్ జంటగా ప్రేక్షకులను మెప్పించారు. సిల్వర్ స్క్రీన్ పై విజయ్- రష్మిక కెమిస్ట్రీకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. గీతా గోవిందం మూవీతో ఇద్దరికీ స్టార్డమ్ వచ్చింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి 2019లో 'డియర్ కామ్రేడ్' చిత్రం చేశారు. ఈ మూవీ ఆశించినంత విజయం సాధించినప్పటికీ.. వీరి మధ్య బంధం మరింత దృఢంగా మారింది.

Rashmika s Ring Reveal Viral Dog Video Sparks Engagement Euphoria with Vijay Deverakonda

ఇక విజయ్- రష్మిక జంట చాలాసార్లు బయట కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అప్పటినుంచీ ఈ జంట డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్డమ్ ను రష్మిక.. హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో చూసినట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని ఆ చిత్రం నిర్మాత నాగవంశీ కూడా ప్రస్తావించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+