రతిక ఎలిమినేషన్ లీక్.. ఇన్‌స్టాలో చెక్కర్లు కొడుతున్న స్క్రీన్ షాట్స్..
బిగ్ బాస్ హౌస్‌లో ఎలిమినేషన్లు తరచుగా బలమైన భావోద్వేగాలను రేకెత్తిస్తాయి. కొంతమంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయినప్పుడు ప్రేక్షకులు ఎంతో నిరాశకు గురవుతారు. మరికొందరేమో వేడుకలు జరుపుకుంటారు. బిగ్ బాస్ తెలుగు షోలో నాల్గవ వారం ఎవిక్షన్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే రతిక రోస్ ఎగ్జిట్ డోర్ తీసుకుంటుందనే ఊహాగానాలు సోషల్‌మీడియాలో విస్తృతంగా వస్తున్నాయి.
ముందు నుంచి సోషల్‌మీడియాలో వస్తున్న వార్త ఇప్పుడు నిజమయినట్టు కనిపిస్తోంది. ఈవారం హౌస్ నుంచి రతిక బయటకు రానుంది. అయితే రతిక ఎలిమినేట్ వార్త నెట్టింట వైరలవుతుంది. బిగ్‌బాస్ హౌస్‌కు పట్టిన శని పోయిందంటూ కొందరు నెటిజ్లను కామెంట్స్ చేస్తున్నారు. అయితే ముందులాగే బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ముందే లీక్ అయ్యినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు రతిక రోస్ అఫీషియల్ ఇన్ స్టా ఖాతా స్టోరీలో చేసిన పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది.

ఇన్‌స్టాలో.. స్క్రీన్ షాట్స్ : రతిక ఎలిమినేట్ కానుందని అప్డేట్ వచ్చింది. కానీ, ఆమె టాప్ 3లో ఉండాల్సిన కంటెస్టెంట్. అమర్ దీప్ లాంటి నెగెటివ్ వ్యక్తుల వల్ల ఆమె తప్పుడుదారిలో నడిచింది. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. సీక్రెట్ రూంలోకి పంపించండి. తన వెనకాల ఏం జరుగుతుందో తనకు తెలియనివ్వండి. అంటూ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చారు. అయితే ఈ స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే వెంటనే రతిక రోస్ ఇన్ స్టా ఖాతా నుంచి ఈ పోస్ట్ డిలీట్ అవ్వడం విశేషం. రూల్స్ కు విరుద్ధంగా ఎపిసోడ్‌కు ముందే ఎలిమినేషన్ లీక్ ఇచ్చారేంటీ అంటూ కొందరు నెట్టిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే, ఇప్పటికే ఆ స్క్రీన్ షాట్స్ నెట్టింట తెగ చక్కర్లు కొట్టేస్తుంది.

రతిక ప్రవర్తనే..ఎలిమినేషన్‌కు కారణం : ముఖ్యంగా పవరాస్త్ర టాస్క్ సమయంలో ప్రశాంత్‌ను రతిక అన్న మాట ఆమె ఓటింగ్ తగ్గిపోవడానికి కారణమయ్యింది. పల్లవి ప్రశాంత్ పట్ల ఆమె దురుసు ప్రవర్తనే ఆమె తొలగింపుకు ప్రధాన కారణమైనట్లు తెలుస్తోంది. రతిక మొదటి నుంచి ప్రశాంత్‌ను రెచ్చగొడుతూ ఎప్పటికప్పుడు తన స్టేట్‌మెంట్లను తిప్పికొడుతుంది. పల్లవి ప్రశాంతపట్ల ఆమె ప్రవర్తించిన తీరు చాలామంది ప్రేక్షుకులకు నచ్చలేదు. దీంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఆమె ప్రవర్తనే ఆమెను ఎలిమినేషన్‌కు దగ్గరయ్యేలా చేశాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఎలిమినేషన్‌కు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నందున, రతికా ఎలిమినేషన్ ఇంతకీ నిజమా? కాదా? అన్న సందిగ్ధత నెలకొని ఉంది.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం











Click it and Unblock the Notifications