బిగ్‌బాస్ హౌస్‌లోకి ర‌తికా రీఎంట్రీ... అభిమానుల‌కే పండ‌గే..

బిగ్ బాస్ షోలో ఏదైనా జరగొచ్చు. ముందు నుంచే హోస్ట్ నాగార్జున అన్న‌ట్లు బిగ్‌బాస్ 7 ఉల్టాపుల్టాగా ఉండ‌బోతుంది. అదే నిజ‌మ‌వబోతుందేమో అనిపిస్తుంది. ప్రేక్ష‌కుల‌ను మెప్పించేందుకు బిగ్‌బాస్ మేకర్స్ ఎలాంటి ప్ర‌యోగాల‌కైనా సిద్ధ‌ప‌డ‌తారు. అందుకే, అనూహ్యంగా ఈ సీజన్ కేవలం 14 మందితో మొదలైంది. ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు.

అందులో మొద‌టివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా రెండో వారం షకీలా, మూడో వారం దామిని హౌస్ నుంచి ఇంటికి బ‌య‌టికి వెళ్లిపోయారు. గత వారం ఎలిమినేషన్ ఓ సెన్సేష‌న్ అనే చెప్పాలి. ఎందుకంటే టాప్ 5లో ఉండాల్సిన ర‌తికా రోస్ ఏకంగా హౌస్‌ని వీడి అభిమానుల‌కు షాక్ నిచ్చింది. అయితే, తాజాగా హౌజ్‌లోకి ర‌తికా రోస్ రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇదేగ‌నుకు జ‌రిగితే ఇక అభిమానుల‌కే పండ‌గే అని చెప్పాలి.

Rathika Rose re-entry into the Bigg Boss

మ‌రో ఛాన్స్ ఇవ్వాలంటూ: ర‌తికాపై తీవ్ర నెగిటివిటీ నేపథ్యంలో ప్రేక్షకులు ఆమెను ఇంటి నుంచి బ‌య‌టికి పంపిచారు. అయితే, రతికా రోస్‌ ప్రవర్తన, పల్లవి ప్రశాంత్ తో ఆమె వ్యవహరించిన తీరుతో ఆమెపై ప్రేక్ష‌కుల‌కు విప‌రీత‌మైన నెగ‌టివీటీ వ‌చ్చింది. అయితే, తాజాగా సోషల్ మీడియాలో రతికా రోస్‌ ఫ్యాన్స్ ఆమెకు ఓ మ‌రో ఛాన్స్ ఇవ్వాలంటూ అడుగుతున్నారు.

అనుకోని కారణాలతో ఆమె గేమ్ తప్పుదోవ పట్టింది. కాబట్టి రతికా రోస్‌ని ఎలాగైనా మ‌ళ్లీ హౌస్లోకి ఆహ్వానించాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఒకసారి ఎలిమినేటైన కంటెస్టెంట్ ని షోలోకి ఆహ్వానించడం జరగని పని అని చాలామంది అంటున్నారు. అయితే, గ‌త సీజ‌న్ల‌ను చూస్తే ఇలాగే ఎలిమినేట్ మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన వారు చాలామందే ఉన్నారు. వారెవ‌రో చూద్దాం..

Rathika rose bigg boss

గ‌త సీజ‌న్ల‌లో నామినేష‌న్లు: ఒక్కసారి హౌస్ నుండి బయటకు వస్తే కంటెస్టెంట్స్ లో ఎవరు టాప్ లో ఉన్నారు? ప‌్రేక్ష‌కులు ఎవ‌రి ఆట‌తీరును మెచ్చుకుంటున్నారనే విష‌యాలు తెలుస్తాయి. అందుకే ఒకసారి ఎలిమినేట్ అయిన వాళ్ళను అంత తేలిగ్గా హౌస్లోకి పంపరు. అయితే, ఇంత‌కుముందు సీజ‌న్ల‌లో ఇలాంటివి జ‌రిగాయి. సీజ‌న్‌2లో యాంక‌ర్ శ్యామ‌ల ఎలిమినేట్ అయ్యి మ‌ళ్లీ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత సీజన్ 3 కంటెస్టెంట్ అలీ రెజా 7వ వారం ఎలిమినేట్ అయ్యాడు.

అయితే ఆడియన్స్ డిమాండ్ మేరకు అతడికి రెండో అవ‌కాశం ఇచ్చారు. దాంతో టాప్ 5 లో అలీ రెజా 4వ స్థానంలో నిలిచాడు. అలాగే సీజన్ 2లో నూతన నాయుడు అనే కంటెస్టెంట్ కాలికి గాయమైంది. బయట ట్రీట్మెంట్ తీసుకుని మ‌ళ్లీ హౌస్లోకి రావ‌డం జ‌రిగింది. అయితే ఈ సారి, రతికా విషయంలో కూడా బిగ్‌బాస్ ఇలాంటి నిర్ణ‌య‌మే తీసుకుంటుందా? లేదా అన్న‌ది మ‌రికొన్ని రోజుల్లో తెలుస్తుంది.

Good news to Rathika Rose Fans

మినీ లాంచింగ్ ఈవెంట్‌: అక్టోబర్ 8 ఆదివారం మరో లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుందట. అందులో భాగంగానే మ‌రో ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి వెళ్లనున్న‌ట్లు స‌మాచారాం. ఇది మినీ లాంచింగ్ ఈవెంట్ లాంటిదే అంటున్నారు నెటిజన్లు. ఈ ఎపిసోడ్ ద్వారా మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ని ఇంట్లోకి పంపనున్నారట. ఇందులో జబర్దస్త్ కెవ్వు కార్తీక్, అంబటి అర్జున్, సీరియల్ నటి పూజా మూర్తి, మ్యూజిక్ డైరెక్టర్ భోలే షామిలి, సీరియల్ నటి అంజలి పవన్, సీరియల్ నటి నయని పావని ఉండ‌బోతున్నారు. వీరితోపాటు ర‌తికా కూడా హౌస్‌లో అడుగుపెట్ట‌బోతుంద‌నే టాక్ వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+