రవితేజ 'ఇరుముడి'కి బిగ్ షాక్: ఆ సీన్లు తొలగించాలంటూ డిమాండ్!

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా సినిమా 'ఇరుముడి' థియేటర్లలోకి వచ్చిన కొద్దిరోజుల్లో ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లను చూపించిన తీరుపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య(ఏపీటీఎఫ్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో టీచర్ల పాత్రను చిత్రీకరించిన తీరుపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్) అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.

50 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపీటలెక్కిన సీనియర్ నటి సిమ్రాన్?
50 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపీటలెక్కిన సీనియర్ నటి సిమ్రాన్?

ఉపాధ్యాయుడి పాత్రను ప్రతికూల రీతిలో చూపించారని ఫెడరేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ సన్నివేశాల్లో చూపించిన పాఠశాల ప్రభుత్వ పాఠశాలలా కనిపిస్తోందని.. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వాడే యూనిఫాంల వంటివే విద్యార్థులు ధరించి ఉన్నారని కూడా వారు పేర్కొన్నారు. ఇలాంటి చిత్రీకరణ ప్రభుత్వ పాఠశాలలు, వాటిలో పనిచేసే ఉపాధ్యాయులపై తప్పుడు అభిప్రాయాన్ని కలిగించవచ్చని ఏపీటీఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సీన్లను వెంటనే తొలగించాలని ఫెడరేషన్ ఇరుముడి బృందాన్ని కోరింది.

అల్లు అర్జున్ 'రాకా’పై మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్!
అల్లు అర్జున్ 'రాకా’పై మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్!
Ravi Teja Irumudi Movie Controversy APTF Demands Removal of School Scenes Full Details Here

ప్రస్తుతం 'ఇరుముడి' సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సమయంలో ఉపాధ్యాయ సంఘం నుంచి ఈ తరహా అభ్యంతరం రావడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఉపాధ్యాయ సమాఖ్య చేసిన ఈ విజ్ఞప్తి, డిమాండ్ పై చిత్ర నిర్మాతలు లేదా రవితేజ బృందం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+