రూ. 200 కోట్ల క్లబ్ లోకి 'ఇరుముడి'..! 55 లక్షలకుపైగా టికెట్ సేల్స్

ఇటీవలి కాలంలో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రాల్లో 'ఇరుముడి' ఒకటి. కంటెంట్ ఈజ్ కింగ్ అనే మాటను మరోసారి నిరూపించింది 'ఇరుముడి'. పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. రిలీజ్ అయిన కేవలం 10 రోజుల్లోనే దాదాపు రూ. 180 కోట్లకుపైగా కలెక్షన్స్ ను కొల్లగొట్టి రూ. 200 కోట్లకు చేరువలో ఉంది. మాస్ మహారాజ రవితేజ గత సినిమాలైన భర్త మహాశయులకు విజ్ఞప్తి, మాస్ జాతర, ఈగల్ సినిమాలు ప్రేక్షకుల్ని అలరించడంలో విఫలమయ్యాయి. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో రవితేజ స్టోరీ సెలక్షన్ పై పూర్తి శ్రద్ధ పెట్టారు. అలా వచ్చిన సినిమానే 'ఇరుముడి' ఇక ఈ మూవీ రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాక రవితేజ కెరీర్‌ లోనే ఫాస్టెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగానూ 'ఇరుముడి' నిలిచింది. ఈ మేరకు ఈ మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

తాజాగా రిలీజ్ అయిన పోస్టర్‌ లో రవితేజ తన తోటి స్వాములతో కలిసి నల్లటి వస్త్రాలు, మెడలో మాలలు ధరించి ఉన్నారు. ఒంటికాలిపై నిలబడి భక్తి పారవశ్యంతో రవితేజ ఇచ్చిన ఫోజు అభిమానులకు గూస్‌ బంప్స్ తెప్పిస్తోంది. ఈ మేరకు ఇరుముడి మూవీ థియేటర్లలో హార్ట్ విన్నింగ్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ టాక్సిక్ ప్లాఫ్ కావడంతో ఈ మూవీకి అనూహ్యంగా కలెక్షన్స్ మరింత పెరిగాయి. ఇదే ఊపు కొనసాగితే ఇరుముడి మూవీ అతి త్వరలోనే 200 కోట్ల క్లబ్‌ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మూవీలోని ఎమోషన్ సీన్స్​ కు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. అంతేకాక రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే బుక్ మైషో, డిస్ట్రిక్ట్ యాప్స్ ద్వారా 55 లక్షలకు పైగా టికెట్ల సేల్స్ జరిగిన మూవీగా ఇరుముడి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

RaviTeja box office rampage Irumudi rakes in180 crore in just 10 days Over 5 5 million tickets sold

ఇక ఇప్పటి వరకూ రూ. 180 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది ఇరుముడి మూవీ. ఒక్క నైజాం ప్రాంతం నుంచే ఈ సినిమాకు రూ. 50 కోట్ల వరకు వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. రిలీజ్ అయిన రెండు వారాలు కావొస్తున్నా థియేటర్ల వద్ద ఈ మూవీ జోష్ ఏమాత్రం తగ్గడం లేదు. సింగిల్ స్క్రీన్స్, మల్టిప్లెక్స్ లు అని తేడా లేకుండా ఎక్కడ చూసినా హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తుండటం విశేషం. ఈ మేరకు లాంగ్ రన్ లో ఈ మూవీకి ఎన్ని కలెక్షన్లు దక్కుతాయనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+