అయ్యో.. రవితేజ 'ఇరుముడి' సినిమాకు బిగ్ షాక్.. ఈరోజే చివరి రోజు..?
మాస్ మహారాజ రవితేజ 'ఇరుముడి' సినిమా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్ తో థియేటర్లలో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21 న విడుదలైన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చాలా ఏళ్ల తర్వాత రవితేజ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇరుముడి మూవీ విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్ల గ్రాస్ సాధించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. రవితేజ కెరీర్ లోనే ఇదే ఫాస్టెస్ట్ అని తెలుస్తోంది. వీకెండ్ లో థియేటర్లలో ఈ మూవీకి ఎక్కడ చూసినా హౌజ్ ఫుల్స్ పడ్డాయి. టికెట్ ముక్క దొరకలేదు. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్ లో ఇప్పటివరకూ 38 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం.
ఇక చాలా రోజుల తర్వాత రవితేజ ఫుల్ జోష్ లో కనిపించారు. ఇరుముడి మూవీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కు హాజరైన ఆయన హ్యాపీ మూడ్ లో కనిపించారు. నవ్వుతూ.. స్టెప్పులేస్తూ ప్రోగ్రామ్ కు వచ్చిన ఆయన మూవీ టీమ్ ను ప్రేమతో ఆప్యాయంగా పలకరించారు. ఈ మధ్య కాలంలో ఇలా చూడలేదని ఇడియట్ నాటి రోజులను గుర్తు చేశారని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఇరుముడి మూవీకి సంబంధించి ఇప్పుడో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆగస్టు 26 రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ మూవీ రిలీజ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీగా స్క్రీన్స్ తగ్గినట్లు తెలుస్తోంది.

ముందు చేసుకున్న అగ్రిమెంట్ల కారణంగా 'టాక్సిక్' మూవీ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా 400 కు పైగా థియేటర్ల నుంచి సినిమాను బలవంతంగా తీసేయాల్సి వస్తోందని ఎగ్జిబిటర్లు తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. "గత ఆరేళ్లలో ఎప్పుడూ చూడని కలెక్షన్లు వస్తున్న టైమ్ లో సినిమా తీసేయడం మా జీవితంలో ఎప్పుడూ చూడలేదు" అని థియేటర్ ఓనర్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారట. ఇరుముడి సినిమా హిట్ అయి, జనాలు ఎగబడి చూస్తున్నా థియేటర్లు ఖాళీ చేయించడమేనా ఇండస్ట్రీ న్యాయం..? అని పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా కామెంట్స్ పెడుతున్నారు. ఇరుముడి సినిమాకు ఓ రకంగా ఈరోజే చివరి రోజు అని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications