మళ్లీ భారీ వర్షాలు - ఈ జిల్లాల పై ప్రభావం, తాజా హెచ్చరిక..!!
వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మరో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రం లో అక్కడక్కడా వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే 28శాతం లోటు వర్షపాతం నమోదు అయింది. దీంతో.. తాజాగా వాతావరణ శాఖ తాజా అలర్ట్స్ కొంత మేర వర్షపాత లోటు తీరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 19న రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆ జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే 20, 21న కూడా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా బుధ, గురువారాల్లో తెలంగాణ అంతటా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గడచిన 24 గంటల్లో హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 9.2, జనగాం జిల్లా నర్మెట్టలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా ఈనెల 1 నుంచి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 61మిల్లీమీటర్ల వర్షపాతమే రికార్డు అయింది.

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. మూసీ నదిలోకి నీటిని విడుదల చేయాల్సి వస్తే దిగువ ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications
