రవితేజ కొత్త సినిమా ప్రకటన.. 'ఇరుముడి'కి మించి.. టైటిల్ ఇదేనా..!
మాస్ మహారాజ రవితేజకు ఎట్టకేలకు బ్లాక్ బస్టర్ హిట్టు పడింది. చాలా ఏళ్లుగా హిట్ లేక ఆకలి మీద ఉన్న రవన్న ఫ్యాన్స్ కు 'ఇరుముడి' రూపంలో ఫుల్ మీల్స్ దొరికాయి. రవితేజ గత సినిమాలు అయిన భర్త మహాశయులకు విజ్ఞప్తి, మాస్ జాతర, ఈగల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో రవితేజ చేసిన సినిమా 'ఇరుముడి'.
ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21 న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ ఈ మూవీ అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో ఇరుముడి మూవీ 1 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సాధించిందని నిర్మాణ సంస్థ తాజాగా అధికారికంగా వెల్లడించింది. రవితేజ కెరీర్ లోనే ఓ సినిమా నార్త్ అమెరికాలో ఈ రేంజ్ మార్క్ ను అందుకోవడం ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో రవన్న ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
అయితే తాజాగా రవితేజ ఏమాత్రం లేట్ చేయకుండా మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన చేస్తున్న తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్లు దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో రవితేజ 64వ ప్రాజెక్ట్ ఖరారైంది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వంలో రవితేజ ఈ సినిమా చేస్తున్నారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా రీఫ్రెషింగ్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అంతేకాక ఈ సినిమాను 2027 జనవరి 14న సంక్రాంతి పండుగ కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.

ఈ మూవీ ప్రకటన నేపథ్యంలో 'దాగుడు మూతలు దండాకోర్.. ఎంటర్ టైన్ మెంట్ హార్డ్ కోర్' అనే హ్యాష్ ట్యాగ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications