రవితేజ 'ఈగల్' రివ్యూ... ఎన్నాళ్టకెన్నాళ్టకు?
నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాలు, మధు, వినయ్ రాయ్, శ్రీనివాసరెడ్డి, అజయ్ ఘోష్ తదితరులు
డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: టీజీ వివ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
సంగీతం: దవ్జాండ్
కథ: ఢీలీలో జర్నలిస్ట్ నళిని (అనుపమ పరమేశ్వరన్) తలకోనలో ఉత్పత్తయ్యే ప్రత్తి గురించి ఓ చిన్న వ్యాసం రాస్తుంది. అయితే అది పెద్ద దుమారం రేపడంతోపాటు నేషనల్ ఇంటిలిజెన్స్ బ్యూరో రంగంలోకి దిగుతుంది. అధికారులు నళినిని కొన్ని గంటలపాటు ఇంటరాగేట్ చేస్తారు. ఎక్కడో తలకోనలో ప్రత్తి గురించి రాస్తే ఢిల్లీలోని ఐబీ ఎందుకు స్పందించింది? అనే విషయమై నళిని పరిశోధన చేస్తుంది. తన దర్యాప్తులో భాగంగా దీనికి మూలకారకుడు సహదేవ్ (రవితేజ) అని తెలుస్తుంది. ఈ సినిమాలోని ఇతర ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈగల్ చూడాలి.

ఈగల్ కు ముందు విడుదలైన రెండు సినిమాలు రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఫ్లాపయ్యాయి. వరుసగా మూడో ఫ్లాప్ కూడా రాకూడదు అనే ధ్యేయంతో ఈ చిత్రంలో రవితేజ నటించాడు. ఈ సినిమా కోసం, పాత్ర కోసం రవితేజ ఎంతగా కష్టపడ్డాడు అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. గత పది సంవత్సరాల్లో ఒక పాత్ర కోసం పూర్తిస్థాయిలో మేకోవర్ అయి చేసిన సినిమా ఏదైనా ఉందా? అంటే అది ఈగల్ అని చెప్పొచ్చు. రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన ఒదిగిపోవడమే కాదు.. ఆ క్యారెక్టర్ లో జీవించారని చెప్పొచ్చు. రకరకాల గన్స్ ను ఆయన హ్యాండిల్ చేసిన విధానం మాత్రం సూపర్ గా ఉంది.
ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా అనుపమ పరమేశ్వరన్ ఆకట్టుకుంది. నవదీప్ కి చాలారోజుల తర్వాత మంచి పాత్ర లభించింది. తన ప్రెజన్స్ & డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. అజయ్ ఘోష్, అవసరాల శ్రీనివాస్ లాంటివారు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాలో డ్రోన్ షాట్స్ బాగున్నాయి. కెమెరామెన్స్ పనితీరు అద్భుతమని చెప్పొచ్చు. సీజీ వర్క్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. నిర్మాణం విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదని అర్థమవుతోంది. దర్శకుడు కార్తీక్ రాసుకున్న కథ చాలా బాగుంది. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారు. స్క్రీన్ ప్లే కేజీఎఫ్ ను గుర్తుచేస్తుంది. దర్శకుడిగా తన మార్క్ ను చూపించడంలో కార్తీక్ విజయం సాధించాడని చెప్పొచ్చు. ఈ సినిమాకు కెమెరామెన్ తోపాటు ఎడిటర్ కూడా ఆయనే అవడం ప్లస్ పాయింట్ అయ్యింది. కెమెరామెన్స్ గా కార్తీక్ తోపాటు కర్మ్ చావ్లా, కమిల్ ప్లోకి పనితీరు ఎంతో బాగుంది. ఈగల్ లో గతంలో ఎన్నడూ చూడని రవితేజను చూస్తారు.












Click it and Unblock the Notifications