RC 17 ప్రాజెక్ట్ పై మైత్రి మూవీస్ కీలక అప్డేట్.. త్వరలోనే పూజా కార్యక్రమం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ఏడాది పెద్ది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 350 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ ప్లాఫ్స్ తో ఉన్న రామ్ చరణ్ కు 'పెద్ది' మూవీ బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ ఫిల్మ్ గా మారింది. అయితే పెద్ది సినిమా తర్వాత రామ్ చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. RC 17 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ మూవీపై ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ కీలక అప్డేట్ ను అందించింది. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని దర్శకుడు సుకుమార్ అండ్ హిస్ టీమ్ సిద్దంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు అధికారిక ఎక్స్ ఖాతాలో ఇందుకు సంబంధించిన ఫొటోలను పంచుకుంది.

"ది మాస్టర్ మైండ్ అండ్ హిస్ డెన్ ఫర్ RC 17 ఆర్ రెడీ.. ఈ జర్నీ త్వరలోనే జరిగే పూజా కార్యక్రమంతో స్టార్ట్ కానుంది. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అప్డేట్స్ కోసం వేచి ఉండండి" అంటూ మైత్రి మూవీస్ పోస్టు పెట్టింది. దాంతో మెగా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఇటీవల ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి RC 17 ఆఫీస్ ను కూడా ప్రారంభించింది చిత్ర నిర్మాణ సంస్థ. అందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇక రామ్ చరణ్- సుకుమార్ క్రేజీ కాంబోపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో 'రంగస్థలం' అనే భారీ బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఈ బ్లాక్ బస్టర్ జోడీ రిపీట్ కానున్న నేపథ్యంలో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
THE MASTERMIND and his DEN for #RC17 are READY🔥The journey begins with the pooja ceremony soon. Stay tuned for exciting updates ✨Mega Power Star @AlwaysRamCharan @aryasukku @SukumarWritings @MythriOfficial https://t.co/zxd9bJ9MGU
— Mythri Movie Makers (@MythriOfficial) October 14, 2026
ఇక RC 17 మూవీలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా ధురంధర్ బ్యూటీ సారా అర్జున్ ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే ఈ మూవీకి సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ కాకుండా అనిరుధ్ ను తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ కు ప్రతినాయకునిగా నటించేది ఎవరు అన్న అంశంపైనా చర్చ సాగుతోంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.












Click it and Unblock the Notifications
