ఆ ఆఫ్ఘన్ క్రికెటర్‌కు ఆస్కార్ ఇవ్వాల్సిందే!

క్రికెట్ స్టేడియంలో ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శనలే కాకుండా కొన్నిసార్లు వారి విచిత్ర ప్రవర్తనలు నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా అబుదాబి వేదికగా అక్టోబర్ 9 నుంచి 13 వరకు ఆఫ్ఙనిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్ చివరి క్షణాల్లో ఆఫ్ఘన్ ఆటగాడు ఖైస్ అహ్మద్ చేసిన నాటకీయ చేష్టలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు అతడికి నటనలో ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

IND vs WI: ఉచిత పాస్‌లతో లక్షల దందా.. భారత్–విండీస్ మ్యాచ్‌కు ముందు నలుగురు అరెస్ట్!
IND vs WI: ఉచిత పాస్‌లతో లక్షల దందా.. భారత్–విండీస్ మ్యాచ్‌కు ముందు నలుగురు అరెస్ట్!

మ్యాచ్ డ్రా కోసం పక్కా ప్లాన్.. లిట్టన్ దాస్ నవ్వులు! '
మ్యాచ్ ముగిసేందుకు కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది. బంగ్లాదేశి విసిరిన 479 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ ఓటమికి దగ్గరవుతున్న వేళ, టెయిలెండర్ ఖైస్ అహ్మద్ ఓ బంతిని ఆడిన వెంటనే తొడ కండరాలు పట్టేసినట్లు నటిస్తూ కాలు పట్టుకుని స్టేడియంలో పడిపోయాడు. వెంటనే ఆఫ్ఘన్ ఫిజియో స్టేడియంలో రావడంతో సమయం వృథా అయింది. ఖైస్ అహ్మద్ ఈ ఓవరాక్షన్ చూసి బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్‌తో పాటు ఇతర ఆటగాళ్లు, కామెంటేటర్లు నవ్వులు ఆపుకోలేకపోయారు.

Qais Ahmad Oscar-Worthy Drama Recalls Gulbadin Naib in Afghanistan vs Bangladesh Test Video Goes Viral

టీ20 ప్రపంచ కప్‌లో గుల్బదిన్ నాయిబ్ సీన్ రిపీట్
ఖైస్ అహ్మద్ చేసిన ఈ పని 2024 టీ20 ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ గుల్బదిన్ నాయిబ్ చేసిన హంగామాను గుర్తుచేసింది. ఆనాడు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వర్షం వచ్చే సూచనలు కనిపించగానే కోచ్ ఆదేశాల మేరకు గుల్బదిన్ అకస్మాత్తుగా స్టేడియంలో పడిపోయి తొడ కండరాల నొప్పితో డ్రామా ఆడటంతో సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. ఇప్పుడు ఖైస్ అహ్మద్ కూడా సరిగ్గా అదే బాటలో నడిచి గుల్బదిన్ నాయిబ్ కు గట్టి పోటీ ఇచ్చాడని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

IND vs WI: హైదరాబాద్‌లో టీమిండియా మరో చరిత్ర సృష్టిస్తుందా?
IND vs WI: హైదరాబాద్‌లో టీమిండియా మరో చరిత్ర సృష్టిస్తుందా?

ఓటమి నుంచి తప్పించుకున్న ఆఫ్ఘనిస్తాన్
ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 346 పరుగులు చేయగా.. ఆఫ్ఘనిస్తాన్ 240 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 372/7 వద్ద డిక్లేర్ చేసి, ఆఫ్ఘనిస్తాన్‌కు 479 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒకానొక దశలో బంగ్లాదేశ్ గెలుపు ఖాయమని భావించినా.. ఖైస్ అహ్మద్, యామిన్ అహ్మద్‌జాయ్ అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించి 2వ ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 346 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+