యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి కోర్టు సమన్లు.. 8 ఏళ్ల నాటి కేసులో ఊహించని ట్విస్ట్!

ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీలోని సాకేత్ కోర్టు బిగ్ షాకిచ్చింది. దాదాపు 8 ఏళ్ల క్రితం నమోదు చేయబడిన కేసులో ధ్రువ్ రాఠీకి కొత్తగా సమన్లు జారీ చేయాలని ఢిల్లీ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ ఐటీ సెల్‌కు చెందిన వికాస్ పాండే దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఆ ఆదేశాలు వెలువడ్డాయి. అక్టోబర్ 12న ఇచ్చిన ఆదేశాల మేరకు గురుగ్రామ్‌లోని ధ్రువ్ రాఠీ నివాసానికి ఫిర్యాదుదారుడి న్యాయవాది సుశాంత్ కుమార్ స్వయంగా వెళ్లి సమన్లను అందించారు.

రూటుమార్చిన కాక్రోచ్ లు..! మరో భారీ నిరసన ప్రకటన..!
రూటుమార్చిన కాక్రోచ్ లు..! మరో భారీ నిరసన ప్రకటన..!

'బీజేపీ ఐటీ సెల్ పార్ట్-2' వీడియో వివాదం.. 2018 నాటి కేసు!
వివరాల్లోకి వెళితే.. 2018లో ధ్రువ్ రాఠీ తన యూట్యూబ్ ఛానెల్‌లో 'బీజేపీ ఐటీ సెల్ పార్ట్-2' పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ద్వారా తన పరువుకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ వికాస్ పాండే కోర్టును ఆశ్రయించారు. అయితే ధ్రువ్ రాఠీ ఎక్కువగా విదేశాల్లోనే నివసిస్తుండటంతో 2019 నుంచి అతనికి సమన్లు అందజేయడం కష్టంగా మారింది. ఇటీవల ఆయన ఇండియాకు వచ్చినట్లు తెలుసుకున్న ఫిర్యాదుదారుడు సాకేత్ కోర్టును ఆశ్రయించగా.. కోర్టు తక్షణమే చర్యలకు ఆదేశించింది. ధ్రువ్ రాఠీ ఫోన్ నంబర్‌కు సంప్రదించినా సమన్లను స్వీకరించడానికి నిరాకరించడంతో సొసైటీ సెక్యూరిటీ గార్డుల సహాయంతో ఇంటి తలుపుపై నోటీసును అతికించినట్లు న్యాయవాది వెల్లడించారు. ఈ కేసులో తదుపరి విచారణ అక్టోబర్ 17న జరగనుంది.

Delhi Saket Court Issues Fresh Summons to Dhruv Rathee in 2018 Defamation Case Full Details Here
నార్త్ కొరియాలోనే ఇలాంటివి చూడగలుగుతాం: ప్రశ్నించిన వాళ్లు పరాయి దేశస్తులవుతారా: ధృవ్ రాఠీ
నార్త్ కొరియాలోనే ఇలాంటివి చూడగలుగుతాం: ప్రశ్నించిన వాళ్లు పరాయి దేశస్తులవుతారా: ధృవ్ రాఠీ

కేజ్రీవాల్ క్షమాపణలు.. మరోవైపు దేవుళ్లపై వివాదాస్పద కామెంట్ల కేసు
గతంలో ఇదే వీడియోను సోషల్ మీడియాలో రీట్వీట్ చేసినందుకు గానూ ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా.. ధ్రువ్ రాఠీకి చట్టపరమైన చిక్కులు ఇక్కడితో ముగియలేదు. మరో వీడియోలో శ్రీరాముడు, సీతాదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అడ్వకేట్ అమిత్ సచ్‌దేవా సాకేత్ కోర్టులోనే మరో పిటిషన్ దాఖలు చేశారు. భవిష్యత్తులో ఇటువంటి కంటెంట్‌పై నిషేధం విధించాలని, నష్టపరిహారం చెల్లించాలని దాఖలైన ఈ పిటిషన్ పై తదుపరి విచారణ నవంబర్ 5కి వాయిదా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+