ఛావా 'హీరో' రెండు సార్లు జైలుకు వెళ్లడానికి కారణం అదేనా ?
ఛత్రపతి శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ మహరాజ్ జీవితకథగా తెరకెక్కిన సినిమా 'ఛావా'. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించారు. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ నటన వేరే లెవల్ అని చెప్పాలి. మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు విక్కీ కౌశల్.
ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో గతంలో రెండు సార్లు జైలుకు వెళ్లినట్టు తెలుస్తోంది. విక్కీ కౌశల్ జైలుకు వెళ్లాడని గతంలో డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ వెల్లడించారు. దీంతో విక్కీ అసలు ఏం చేశారు ? ఎందుకు జైలుకు వెళ్లారు అని సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

విక్కీ గతంలో జైలుకు వెళ్లినట్టు బయటపడింది. గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు అనుమతి లేకుండా ఒక ప్రదేశంలో షూటింగ్ చేశామని.. అప్పుడు అది అక్రమ ఇసుక గని అని తెలిసిందని.. ఇసుక మాఫియా జరిగిన ఆ ప్రదేశంలో కాల్పులు జరిపినందుకు విక్కీ రెండుసార్లు అరెస్ట్ అయ్యాడని రెండుసార్లు జైలుకు వెళ్లాడని అనురాగ్ వెల్లడించారు.
ఫిల్మ్ కెరీర్..
సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు విక్కీ కౌశల్. కానీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. అనురాగ్ దర్శకత్వం వహించిన ప్రముఖ చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్"కు విక్కీ కౌశల్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రల్లో నటించినప్పటికీ.. 2015ల మాసాన్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఉధమ్ సింగ్, ఉరి సర్జికల్ స్ట్రైక్, సంజు వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇక ఛావా సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగాడు.
ఇక ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న ఈ హీరో.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చిన కత్రీనా.. ప్రస్తుతం పెళ్లి లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.
-
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications