Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీజ విడాకుల వెనుక ఉన్న రహస్యం అదే..? ఇన్నాళ్లకు బయటపడ్డ అసలు నిజం

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిందే. శ్రీజ మొదట భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెద్దలను ఎదురించి మరి అతన్ని వివాహం చేసుకుంది. శ్రీజ ప్రేమ వివాహం అప్పట్లో పెను సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఆ సమయంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌లపై శ్రీజ సంచలన ఆరోపణలు చేసింది. భరద్వాజ్‌తో శ్రీజ కాపురం కొన్నాళ్లు బాగానే సాగింది.

కూతురు పుట్టిన తరువాత భర్త భరద్వాజ్‌తో విభేదాలు రావడంతో..అతనికి విడాకులు ఇచ్చింది. పెద్దలు కుదిర్చిన వ్యక్తిని శ్రీజ రెండో వివాహం చేసుకుంది. శ్రీజ రెండో భర్త కల్యాణ్ ఒకటి రెండు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. తరువాత కొద్దిరోజులకే రెండో భర్త నుంచి కూడా శ్రీజ దూరంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఆఫిషియల్‌గా ప్రకటించకపోయినప్పటికీ..శ్రీజ- కల్యాణ్ ఇద్దరు వీడిపోయారని తెలుస్తుంది.

reason behind chiranjeevi daughter sreeja first marriage divorce

సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన ఫొటోలను తొలగించడంతో.. పాటు.. ఒకరినొకరు అన్ ఫాలో చేయడంతో..వీరిద్దరూ విడిపోయారని నెటిజన్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ మధ్య శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చినప్పటికీ అది కేవలం ప్రచారం మాత్రమే అని తేలిపోయింది. ప్రస్తుతం ఇద్దరి పిల్లలతో శ్రీజ తన తండ్రి చిరంజీవితోనే ఉంటుంది. ఇదిలా ఉంటే ఇటీవలే శ్రీజ మొదటి భర్త భరద్వాజ్ అనారోగ్యంతో మరణించారు.

శ్రీజతో విడాకులు తీసుకున్న కొన్నాళ్లుకు అతను మరో అమ్మాయిను వివాహం చేసుకున్నాడు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భరద్వాజ్ కొద్ది రోజుల క్రితమే మరణించాడు. ఇదిలా ఉంటే భరద్వాజ్‌తో శ్రీజ విడిపోవడానికి వరకట్నం వేధింపులే అని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఇందులో వాస్తవం లేదని అప్పట్లోనే భరద్వాజ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీనిపై భరద్వాజ్ మాట్లాడుతూ.. తాను వరకట్నం కోసం వేధిస్తున్నాను అనేది నిజం కాదని, అవి తప్పుడు ఆరోపణలు అని, దానికోసమే కోర్ట్‌కి వెళ్లామని, కోర్ట్‌లో అది తప్పు అని తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు భరద్వాజ్.

అయితే శ్రీజ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అనేది శ్రీజనే అడగాలని చెప్పారు. ఆమె ఎందుకు ఇలా చేసిందో తెలియదని, అయితే ఇది తమ లైఫ్‌లో చిన్న డిస్టర్బెన్స్ మాత్రమే అని, సెట్‌ అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు భరద్వాజ్. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, 2011లో శ్రీజ విడాకుల కేసు నమోదు చేయగా, మూడేళ్లకి కోర్టు విడాకులు జారీ చేసింది. భరద్వాజ్ మరణించడంతో మరోసారి ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. శ్రీజతో విడాకులకు వరకట్నం వేధింపులు కారణం కాదని భరద్వాజ్ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+