విజయ్ దేవరకొండను తొక్కేస్తోంది ఎవరు?

విజయ్ దేవరకొండ తాజా చిత్రం ఫ్యామిలీస్టార్ విడుదలై మొదటిరోజు మొదటి ఆట నుంచే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. సినిమా ఎలా ఉంది? అనే విషయంకన్నా విజయ్ పై ఎక్కువగా వ్యతిరేకతను వ్యాపింపచేస్తున్నారనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు. నిర్మాత దిల్ రాజుపై ఉన్న వ్యతిరేకత కూడా ఈ సినిమాపై ప్రభావం చూపుతోందంటున్నారు. గుంటూరు కారం సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న దిల్ రాజు అదే సమయంలో విడుదలైన హనుమాన్ చిత్రానికి థియేటర్లు ఇవ్వకుండా అడ్డుపడ్డారంటూ వార్తలు వచ్చాయికానీ వాటిని ఆయన ఖండించారు.

తీరా చూస్తే ఆయన సొంత నిర్మాణ సంస్థలో సొంతంగా తీసిన ఫ్యామిలీస్టార్ మాత్రం ఇప్పుడు పరాజయం పాలై దిల్ రాజుకు షాక్ ఇచ్చింది. అలాగే డైరెక్టర్ పరశురామ్ కూడా సినిమాను సరిగా తీయలేకపోయారు. ఇప్పటికే నిలకడ లేకుండా ఒక నిర్మాత, దర్శకుడికి ఓకే చెప్పి హఠాత్తుగా వేరే హీరోకు, నిర్మాతకు ఓకే చెప్పడం అలవాటుగా మారిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తయితే పెళ్లిచూపులు తర్వాతే బండికి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టానని, మధ్యతరగతి కుటుంబమంటూ చెప్పడం కూడా కొంత నెగటివిటీ రావడానికి కారణమైంది.

reason for the negativity on the hero vijay devarakonda

విజయ్ మాట్లాడే మాటలన్నింటినీ నెటిజన్లు బాగా ట్రోల్ చేశారు. అయినా పరిశ్రమలో స్టార్ హీరోగా నిలదొక్కుకోకుండా ఉండేందుకు ఒక స్టార్ హీరో, అతని పీఆర్ టీం విజయ్ పే వ్యతిరేక భావాన్ని వ్యాపింపచేస్తుంటారని, ట్రోల్ చేస్తుంటారని, సోషల్ మీడియాలో ప్రచారాన్ని ఉధృతం చేస్తుంటారని వార్తలు ఎప్పటినుంచో వస్తున్నాయి. అయితే విజయ్ మాట్లాడే మాటలు కూడా వారికి మంచి ముడిసరుకును ఇస్తుంటాయి. ఓ అగ్ర దర్శకుడు కూడా విజయ్ తో సినిమాను ప్లాన్ చేసుకున్నప్పటికీ అతనితో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకున్న స్టార్ హీరో ఆ సినిమాను ముడిపడనివ్వలేదని వార్తలు గతంలోనే వచ్చాయి. విజయ్ ను నిజంగానే ఎవరైనా తొక్కేస్తున్నారా? లేదంటే అతన్ని అతనే తొక్కేసుకుంటున్నాడా? అనేది తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+