వేణుస్వామి దెబ్బకు పేరు మార్చుకున్న ప్రభాస్?
పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. మొదటిరోజు రూ.191.5 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టగా, రెండోరోజు 107 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండు రోజులకు దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసిన కల్కి చిత్రంపై ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో తలుచుకుంటే పాన్ ఇండియా రికార్డులే కాదని, పాన్ వరల్డ్ రికార్డులు కూడా బద్ధలవుతాయని నమ్మకంగా చెబుతున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనేతోపాటు స్టార్ దర్శకులు, స్టార్ హీరోలు అతిథి పాత్రల్లో తళుక్కున మెరిశారు.
ప్రభాస్ కాస్తా శ్రీ ప్రభాస్ అయ్యారు!
ఈ సినిమా టైటిల్స్ పడినప్పుడు ప్రభాస్ పేరు ముందు శ్రీ అని వేశారు. అంటే అది గౌరవించినట్లు కాదు. పేరుకు ముందు చేరిన మరో అక్షరం. శ్రీప్రభాస్ అని ఇకనుంచి వ్యవహరించాల్సి ఉంది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. రెబల్ స్టార్ ప్రభాస్ కదా.. కానీ ఇలా వేశారు ఏమిటి? అని అందరూ చర్చించుకున్నారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఆయన కుటుంబ సభ్యుల నుంచి లీకైన సమాచారం ప్రకారం ఇకనుంచి ప్రభాస్ పేరు శ్రీప్రభాస్ అని మారింది. అలా మార్చడం వెనక చాలా పెద్ద కథ ఉందని చెబుతున్నారు.

జాతకంలో అన్నీ దోషాలే
ప్రభాస్ జాతకంలో చాలా దోషాలుండటంవల్ల ఇప్పటివరకు ఆయనకు వివాహం కాలేదని, సినిమాలు కూడా ఫ్లాప్స్ అవుతాయని, అలాగే ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలని జ్యోతిష్య పండితులు చెప్పారని తెలుస్తోంది. ఆయన పేరుకు ముందు శ్రీ అని కలిపితే కలిసివస్తుందని, జీవితం విజయపథంలో సాగుతుందని తెలిపారంట. గతంలో కూడా చాలామంది అపజయాల్లో ఉంటే పేరుకు ముందు శ్రీ కలుపుకొని విజయాలు సాధించారని, అలా అదృష్టం కోసమే ప్రభాస్ పేరుకు ముందు శ్రీ కలపాలని వారు చెప్పారు. అయితే ఇటువంటివాటిపై పెద్దగా నమ్మకం లేని ప్రభాస్ దీనికి ఒప్పుకోలేదు. అయితే తన తల్లి సూచించడంతో ఆమె కోసమే దీనికి ఓకే చెప్పాడంటున్నారు. పేరుకుముందు శ్రీ అనేది ప్రభాస్ కు ఏవిధంగా కలిసివస్తుందో చూద్దాం.
వేణుస్వామి కోసం వెదుకుతున్న డార్లింగ్ అభిమానులు
అయితే నెటిజన్లు మాత్రం జ్యోతిష్యుడు వేణుస్వామి కొంతకాలం నుంచి ప్రభాస్ సినిమాలు ఆడవని, పెట్టిన డబ్బులను కూడా వసూలు చేయవని, ఆయన ఆరోగ్యం బాగోలేదని చెబుతూ వస్తున్నాడు. దీనిపై ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. ఒకరకంగా ఆయన బయట కనపడితే కొట్టడానికి కూడా సిద్ధమయ్యారు. కొందరు నెటిజన్లు వేణుస్వామి వల్లే జాతకంలో దోషాలున్నాయని పేరుకు ముందు శ్రీ అనేది డార్లింగ్ చేర్చుకున్నాడని కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications